నమ్రతా వల్లే బ్రహ్మోత్సవంకి అంత రేటు అట

Brahmotsavam US Rights Sold For 13 crores by Namrata

03:54 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Brahmotsavam US Rights Sold For 13 crores by Namrata

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా షూటింగ్‌ కూడా పూర్తికాని ఈ చిత్రానికి సంబందించి రైట్స్‌ ఇప్పటికే పూర్తి అయిపోగా ఎన్నడూ లేని విధంగా అత్యధిక రేటుతో యూఎస్‌లో అమ్ముడైపోయింది. ఈ డీల్‌ కుదిర్చింది ఎవరో కాదు మహేష్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ అట. ఈ చిత్రానికి మహేష్‌ సహ సిర్మాతగా వ్యవహరిస్తుండడంతో నమ్రతా రంగంలోకి దిగిందట. యూఎస్‌లో తెలుగు సినిమాలకి అంత రేటు రాదని యూఎస్‌ డిస్ట్రిబ్యూటర్లు చెప్పినా నమ్రతా ససేమిరా అందట. దీనితో చేసేది లేక నమ్రతా చెప్పినా 13 కోట్లు వాళ్ళు చెల్లించారట. ఇప్పటి వరకు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' 10.5 కోట్లకి అమ్ముడుపోగా, ఇప్పుడు బ్రహ్మూెత్సవం చిత్రం ఏకంగా 13 కోట్లుకి అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యం చేసింది.

English summary

Mahesh Babu's upcoming film Brahmotsavam movie was creating new records before releasing.The US rights of this film were sold recently for huge amount of 13 crores.This US rights were sold to that much of huge ammount because of Mahesh Bau's wife Namrata.