మహేష్ కి ‘వచ్చింది కదా అవకాశం’

Brahmotsavam Vacchindi Kada Avakasam Lyrical Video

09:36 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam Vacchindi Kada Avakasam Lyrical Video

మహేష్బాబు, కాజల్‌ అగర్వాల్‌, సమంత ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రంలోని ‘వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం’.. అనే పాట లిరికల్‌ వీడియో చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యమందించగా, అభయ్‌ జోద్పూరకర్‌ పాడాడు. ఇటీవలే ఈ చిత్రంలోని మధురం.. మధురం పాట టీజర్‌ను విడుదల చేశారు. ఈనెల 7వ తేదీన ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ వి. పొట్లూరి,మహేష్బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. సరదాగా కుటుంబమంతా కలిసి వేడుకలు జరుపు కుంటున్నప్పుడో, గెట్ టు గెదర్ ఈవెంట్స్ లేదా పెళ్ళిళ్ళు, సంగీత్ వంటి ఫంక్షన్ల లోనో హాయిగా పాడుకునేందుకు అనువైన పాట ఒకటి వచ్చేసిందని అప్పుడే టాక్ వినిపిస్తోంది. వచ్చింది కదా అవకాశం అనే ఈ పాటను మొత్తం మూవీ స్టార్ కాస్ట్ పై చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి:మా చుట్టాలు వెళ్ళడం లేదంటూ పోలీస్ కేసు పెట్టాడు

ఇవి కూడా చదవండి: ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

ఇవి కూడా చదవండి: చైతూకి క్లాస్ పీకిన వెంకీ!

English summary

Super Star Mahesh Babu's upcoming film was "Brahmotsavam" and recently this movie Video Songs were releasing by the movie unit.Yesterday This movie" Vacchindi Kada Avakasam "Lyrical Video song was released by the movie unit.