ఒలింపిక్‌ రద్దు యోచన లేదు: బ్రెజిల్‌

Brazil Says Rio Olympics will not be cancelled

09:36 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Brazil Says Rio Olympics will not be cancelled

బ్రెజిల్ ను ప్రమాదకరమైన జికా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో రియో ఒలింపిక్ గేమ్స్ ను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బ్రెజిల్ ఖండించింది. రియో ఒలింపిక్స్ ను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని బ్రెజిల్‌ క్రీడా మంత్రి జార్జ్‌ హిల్టన్‌ వెల్లడించారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో ప్రమాదకరమైన జికా వైరస్‌ అనూహ్యంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ గేమ్స్‌ రద్దు చేసే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు హిల్టన్‌ ఖండించారు. ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తమ ప్రభుత్వం 2016 ఒలంపిక్‌ గేమ్స్‌ నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రెజిల్‌కు ప్రయాణాలపై నిషేధం విధించలేదని.. గర్భిణులు ఒలింపిక్స్‌కు వెళ్లొద్దని మాత్రమే సూచించిందని ఆయన పేర్కొన్నారు.

English summary

Brazilian organizers have reiterated they have no intention of canceling the Rio Olympics because of the outbreak of the Zika virus.This was said by Sports Minister George Hilton