బంగారు పతకం...దొంగల బారిన పడ్డాడు

Brazil Thieves Theft Gold Medals From Rio Winners

11:14 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Brazil Thieves Theft Gold Medals From Rio Winners

ఇదేమిటి అనుకుంటున్నారా అవును అక్కడి దొంగలు ఎవరినీ వదలరని దీన్ని బట్టి చెప్పొచ్చు. ఓ సారి వివరాల్లోకి వెళ్తే, అతడు రియో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన హీరో. దీంతో సంతోషం అతని ముఖంలో కళకళ లాడుతోంది. ఇంతలోనే ఆ చాంపియన్ కు దొంగలు చెమటలు పట్టించారు. అంతేకాదు అతడి జేబును కూడా కొల్లగొట్టారు. పోలీసు వేషాల్లో వచ్చిన ఆ దొంగలు ఈ చాంపియన్ కు చుక్కలు చూపించారు. అతడితో పాటు ఉన్న మరో ముగ్గురు ఒలింపిక్ అథ్లెట్లనూ దొంగలు వదలలేదు.

రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో అప్పుడే ఓ బంగారు పతకాన్ని తన ఖాతాలో అమెరికన్ స్విమ్మర్ రియా లోక్టే వేసుకున్నాడు. ఆ ఆనందంలో మరో ముగ్గురు అథ్లెట్లతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. అతడు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగొస్తుండగా పోలీసుల దుస్తుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు కారును ఆపేశారు. ఆ రియన్ తో సహా ముగ్గురుని కారు దింపి, గ్రౌండ్ పై మోకరిల్లమని బెదిరించారు

అయితే మిగిలిన ముగ్గురు క్రీడాకారులు ఆలా మోకరిల్లారు. తాను ఏం తప్పు చేయలేదని, ఎందుకు మొకాళ్లపై నిల్చోవాలని రియాన్ ఎదురు తిరిగాడు. దీంతో ఆ దొంగ పోలీసుల్లో ఒకరు రియాన్ తలకు తుపాకీ గురిపెట్టాడు. అంతే వారి పర్సులను తీసుకొని దొంగలు ఉడాయించారు. ఈ సీన్ తో రియాన్ కు చెమటలు పట్టినా, వారు ఏం చేయకుండా వెళ్లడంతో హమ్మయ్య అనుకొని అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణం గెలిచినా, దొంగల బారినుంచి తాప్పించుకోలేక పోయాడు.

ఇవి కూడా చదవండి:సాయంత్ర సమయంలో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఉండదట

ఇవి కూడా చదవండి:యంగ్ టైగర్ ఫాన్స్ కి సారీ చెప్పిన మోహన్ లాల్

English summary

Brazil Thieves once again showed their talent and recently they theft Gold Medals from Rio Olympic Gold Medal Winners by Showing Gun. Later the players have been Complained to Brazil police on this incident.