పెళ్ళికూతురు ఏం అడిగిందో తెలుసా ..!

Bride Asked for 10,000 Saplings as a wedding gift

05:47 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Bride Asked for 10,000 Saplings as a wedding gift

పెళ్ళిలో ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు కానుకలను ఇచ్చిపుచ్చుకోవడం సహజమే. అయితే ఆడవారు నగ,నట్రా కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక వధువు వింత కోరిక కోరుకుంది. 22 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయి, పెళ్ళి పీటలు ఎక్కబోతున్న సమయంలో కాబోయే అత్త మామలను ఒక కోరిక కోరింది. వజ్ర వైడూర్యాలు కొనివ్వమని, వడ్డాణం చేయించమని ఆమె అడగలేదు. 10,000 మొక్కలు నాటించమని అడిగింది. వింతగా ఉంది కదూ..

ఇది కూడా చదవండి : తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌ లోని భిండ్‌ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కిషిపురా అనే గ్రామానికి చెందిన ఆమె పేరు ప్రియాంకా భడొరియా. ఆ వూరి ఆచారం ప్రకారం వధువుకి కావలసిన కానుకలని మగపెళ్ళివారు ఇవ్వాలి ఇది అక్కడ రూల్‌. అయితే మగపెళ్ళి తరుపున వారు వచ్చి ప్రియాంకని ఏమి కావాలని అడిగితే ఆమె నగలు, డబ్బులు ఏమీవద్దు 10,000 మొక్కల్ని నాటించండి చాలు అందట. దానికి వారు హ్యాపీగా అంగీకరించారు.

ఇది కూడా చదవండి : రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

5000 తల్లి ఇంటి వద్ద, మిగిలిన 5000 తన అత్త ఇంటివద్ద ఉంచి అక్కడ చుట్టు పక్కల ప్రజలకు పంచి పెట్టిందట ప్రియాంక. చిన్నప్పటి నుండి తన తండ్రి కరువు వల్ల పడిన కష్టాలను చూస్తూ వచ్చింది. దాంతో ఆమె చిన్నతనం నుండి ఎన్నో మొక్కలను నాటిందంట. మరో విశేషం ఏమిటంటే ఆమె పెళ్ళి ఎర్త్‌డేనాడు జరిగింది. ఆమె ముందు చూపుకి పర్యావరణంపై ఉన్న అవగాహనకి అక్కడి వారంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి : కొడుకు ప్రేమ..తండ్రి చావుకొచ్చింది

English summary

When the bridegroom’s sister asked the bride Priyanka Bhadoria what kind of gold and ornaments she wanted, she was in for a pleasant surprise. She Refused Gold and ornaments.