పెళ్లిలో కోడలికి కిస్ పెట్టేసాడు ... ఆపై ఏమైందో తెలుసా?

Bride Groom's father kissed Bride in the marriage ceremony

11:54 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Bride Groom's father kissed Bride in the marriage ceremony

పెళ్లంటే నూరేళ్ళ పంట.. ఇక వివాహ సమయంలో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం సహజం. కొన్ని సందర్భాల్లో ఇరువురి బంధువులు, స్నేహితుల మధ్య పందాలు నడుస్తాయి. ఇటీవల చైనాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో బంధువులతో పందెం కట్టి వధువుని ముద్దు పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా.. పెళ్లికొడుకు తండ్రి.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెనెన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు బంధువులు, స్నేహితులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లికొడుకు తండ్రితో ఒక బంధువు పందెం వేశాడు. పందెం ఏంటో తెలుసా? పెళ్లి కూతుర్ని ముద్దుపెట్టుకోవాలని. పందెం విలువ 10వేల యువాన్లు. అందుకు పెళ్లికొడుకు తండ్రి సిద్ధమని చెప్పి.. వెంటనే పెళ్లికూతురి వద్దకి వెళ్లి ఆమెను ముద్దాడాడు. వేడుకకు వచ్చిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకుని చప్పట్లు కొడుతూ నవ్వులు పంచారు.

పోటీలో గెలిచావంటూ సదరు వ్యక్తి వచ్చి పెళ్లికొడుకు తండ్రికి నగదు అందజేశాడు. చైనాలో వివాహ వేడుకల్లో వధూవరులను ఉత్సాహ పరిచేందుకు అతిథులు ఆటపాటలు నిర్వహిస్తుంటారు. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో పలువురు పెళ్లికొడుకు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన బాగోలేదంటూ కామెంట్లు చేశారు. ఇక దీనిపై కామెంట్స్ అదిరిపోతున్నాయి.

ఇది కూడా చూడండి : 2016లో టాలీవుడ్ లో మురిపించిన ప్రేమ కధలు

ఇది కూడా చూడండి : 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

ఇది కూడా చూడండి : ఇవన్నీ అబద్ధాలే ... 2016 లో చక్కర్లు కొట్టిన ఘటనలు

English summary

Bride Groom's Father kissed Bride in the marriage ceremony. The people who attended the marriage took the video of this situation and published.