పెళ్ళికొడుకు ప్ర్రాణం తీసిన పెళ్ళి వేడుక 

Bridegroom Died In A Marriage Event In Uttar Pradesh

05:17 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Bridegroom Died In A Marriage Event In Uttar Pradesh

పెళ్ళి వేడుక ఏంటి పెళ్ళి కోడు ప్రాణం తీయడం ఏంటి అనుకుంటున్నారా.? అవును ఆ పెళ్ళి వేడుకలో ప్రాణాలు కోల్పోయింది పెళ్లికొడుకే.

వివరాలోకి వెళ్తే..... ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ లో సరదాగా జరగాల్సిన ఒక పెళ్ళి వేడుక విషాదంగా మిగిలింది. అమిత్ అనే 28 ఏళ్ళ యువకుడు అతని బంధు మిత్రులతో కలిసి అతని పెళ్ళి వేడుకలో సందర్భంగా గుర్రం మీద ఊరేగిస్తున్నారు. ఈ ఊరేగింపులో పెళ్ళికొడుకు బంధువులో ఒకరు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఎలా తగిలిందో కాని ఒక బులెట్ వచ్చి పెళ్ళికొడుకు తలకు తగలడంతో అక్కడికక్కడే పడిపోయిన పెళ్ళికొడుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు చెప్పడంతో కొద్దిసేపటిలో పెళ్ళి కానున్న తమ కుమారుడిని చూసి అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

English summary

A wedding ended in a tragedy as a groom was killed in celebratory firing as the marriage procession arrived at a guest house here, police said on Thursday.A 28-year-old groom was killed in Sitapur, Uttar Pradesh, on Wednesday when members of his wedding party fired their guns in celebration.