షాకింగ్ న్యూస్ : పెళ్లి కూతురిపై అత్యాచారం

Bridegroom Harassed In Jagtial

11:00 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Bridegroom Harassed In Jagtial

ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకీ దారుణాలు పెచ్చుమీరిపోతున్నాయి. తెల్లారి లేచింది మొదలు ఎక్కడో అక్కడ దారుణం గురించే వింటున్నాం. అత్యాచారాలు , లైంగిక దాడుల గురించి ఇక చెప్పక్కర్లేదు. తాజాగా మరో అత్యాచారం వెలుగుచూసింది. మరో ఆరు రోజుల్లో పెళ్లి.. కొత్త జీవితంపై ఆ అమ్మాయికి ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు. కానీ వాటన్నింటినీ ఆ దుర్మార్గులు అడియాసలు చేస్తూ, వివాహ వేడుక కోసం షాపింగ్ చేసేందుకు వెళ్లిన ఆ యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘోరం గురించి జగిత్యాల ఎస్పీ అనంత శర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.

మల్యాల మండలం రాంపూర్ కు చెందిన 21 ఏళ్ల యువతికి ఈ నెల 21న వివాహం నిశ్చయమైంది. వివాహ సామగ్రి, గాజులు, మెహందీ తదితర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు తల్లితో కలిసి గురువారం జగిత్యాల పట్టణానికి వెళ్లింది. తల్లి మరో పని నిమిత్తం కొత్త బస్టాండ్ ప్రాంతంలోనే వాహనం దిగారు. యువతి పాత బస్టాండ్ వరకు వెళ్లి తన మిత్రులకు శుభలేఖలు అందజేసింది. షాపింగ్ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కారు. ఆమె ముక్కుకి దుండగులు మత్తుమందు చూపడంతో ఆ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలు వొలుచుకున్న ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత కొండగట్టు వద్ద రాత్రి సమయంలో వదిలి వెళ్లారు. శుక్రవారం ఉదయం స్పృహలోకి వచ్చిన యువతి.. ఇతరుల ఫోన్ తో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న హోంగార్డులు ఆ యువతిని విచారించి మల్యాల పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిపై కిడ్నాప్ , దొంగతనం, అత్యాచారం కేసు నమోదు చేసారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

English summary

An innocent bridegroom got harassed by three people in Jatial when she went for purchasing clothes, accessories, things for her marriage event.