ఈబేలో బ్రిడ్జిని వేలానికి పెట్టారు 

Bridge for sale on Ebay

05:05 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Bridge for sale on Ebay

ఆన్‌లైన్‌ అంగడి ఈబేలో మీరు ఏదైనా అమ్మకానికి పెట్టచ్చు. కానీ ఒక ఆకతాయి ఏకంగా స్కాట్లాండ్‌ లోని ఒక బ్రిడ్జిని అమ్మకానికి పెట్టి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసాడు. వివరాలల్లోకెళితే ఈబేలో ఒక ఆకతాయి పెట్టిన వేలం ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది. ఆ ప్రకటనలోని సారాంశం ఏమిటంటే స్కాట్లాండ్‌లోని ఫోర్ట్‌రోడ్‌ బ్రిడ్జిగా పిలవబడే బ్రిడ్జిని గుర్తుతెలియని ఒకరు ఈబే వెబ్‌సైట్‌లో అమ్మేస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఇప్పటికి 69మందికి పైగా ఈ ప్రహసనంలో పాలు పంచుకున్నట్లుగా 70వేల పౌండ్లకు అత్యధిక మొత్తంలో బిడ్‌ను కూడా నమోదుచేసారు. ఈ బ్రిడ్జికు తాను న్యాయపరంగా ఏమాత్రం యజమానిని కాదంటూనే, దీన్ని కొన్న వారు మొత్తం తుక్కుగా అమ్ముకునేందుకు ఎంతో బాగుంటుందని కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం పలువురిని ఆకర్షిస్తుంది. 50సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ బ్రిడ్జిలో లోపాలు ఉన్న కారణంగా రాకపోకలను నిలిపి వేయడంతో విసిగి వేసారిన ఎవరో ఒకరు ఇలాంటి పనికి పూనుకుని ఉంటారని భావిస్తున్నారు.

English summary

An unknown person in scotland puts a bridge on online for sale.That bridge is named as Four Road Bridge in scotland