కుర్చీ తెచ్చిన అదృష్టం

Britain Couple Found Ornaments in Old Chair

11:25 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Britain Couple Found Ornaments in Old Chair

మనం తరచూ వినేమాట దేనికైనా అదృష్టం ఉండాలి అనేది. అవును అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో కూడా చెప్పలేం. సరిగ్గా ఓ జంట జీవితంలో ఇది అక్షరాలా నిజమైంది. అదృష్టం కలిసొస్తే.. పనికిరాని వస్తువు కూడా అమూల్యమైనదిగా మారిపోతుందని రుజువుచేస్తూ, పాత కుర్చీని తక్కువ ధరలో కొని తెచ్చుకుంటే.. దాంట్లోంచి లక్షలు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. దీంతో ఆ జంటకు అనుకోని అదృష్టం కల్సి వచ్చేసింది.

బ్రిటన్ కు చెందిన ఎంజిలా మిల్నర్ .. అంగుస్ దంపతులు ఆరేళ్ల క్రితం యాక్షన్ కంపెనీ నుంచి 1900కాలం నాటి పాత కూర్చీని 5 పౌండ్లకు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారట. దాంతో పెద్దగా అవసరం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే మూలన పెట్టేశారు. ఇటీవల మరమ్మతుల కోసం కుర్చీ బయటకు తీసి శుభ్రం చేస్తుండగా వజ్రాలతో కూడిన ఉంగరం.. చెవి కమ్మలు.. క్లిప్ దొరికాయి. వాటి విలువ రూ. 5లక్షలకు పైగా ఉంటుందట. అయితే.. అంగుస్ తన భార్యకు ఈ విషయం చెప్పకుండా వారి వివాహ వార్షికోత్సవానికి ఉంగరాన్ని.. ప్రేమికుల రోజున చెవి కమ్మలు.. ఈస్టర్ రోజున క్లిప్ బహుమతిగా ఇచ్చాడట.

తనపై ప్రేమతో అంత ఖర్చు పెట్టి వజ్రాభరణాలు ఇచ్చాడని ఎంజిలా పొంగిపోయింది. అయితే ఆతర్వాత కుర్చీలో లభించిన ఆభరణాలని ఆమెకు తెలిసిపోయింది. దీంతో భర్తపై ఒకింత కోపం వచ్చినా.. వూహించని విధంగా అదృష్టం వరించినందుకు తెగ సంబరపడిపోయింది. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:అచ్చం .. భూమి లాగే మరో 20 గ్రహాలున్నాయా!

ఇవి కూడా చదవండి:నీతా అంబానీ అరుదైన రికార్డు

English summary

A Britain couple was recently bought an old chair for 5 Pounds and they wanted to repair that chair, when they were cleaning that chair they found diamond ornaments worth 5000 Euro's.