వావ్ ఇదేం రూలండి - నడుం నాజూకుగా లేకుంటే టాక్స్ తప్పదట

Britain Government Made New Rules To Decrease Obesity

11:10 AM ON 12th December, 2016 By Mirchi Vilas

Britain Government Made New Rules To Decrease Obesity

ఆరోగ్యం కోసమో మరో దానికోసం తెలీదు కానీ బ్రిటన్ లో ఓ కొత్త రూలు పెట్టారట. నాజూకైన నడుం లేకుంటే పన్ను విధిస్తారట. పైగా ప్రధాని ఈ ప్రకటన చేశారట. ఇదేమిటబ్బా అనుకుంటున్నారా .. అవును నిజం .. ఇంతకీ ఈ రూలు ఎందుకు పెట్టారంటే, నాజూకైన నడుములున్నవాళ్ళు తగ్గిపోతున్నారట. చిన్నారులు కూడా గున్న ఏనుగుల్లా తయారవుతున్నారట. దీంతో ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మూడింట రెండొంతుల మంది అధిక బరువు, ఊబకాయంగలవారేనని ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు బాధిస్తాయని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీనికి విరుగుడు తన దగ్గర ఉందని బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మే అంటున్నారు.

చిన్నారులు ఊబకాయులుగా మారడాన్ని రాబోయే పదేళ్ళలో బాగా తగ్గించాలని థెరీసా మే లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలలు ఎక్కువ కేలరీలు లాగించేయకుండా సాఫ్ట్ డ్రింక్స్ ఇండస్ట్రీపై 2018 నుంచి సుగర్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించారు. పిల్లలు బాగా ఇష్టపడే డ్రింక్స్ లో సుగర్ ను 5 శాతం తగ్గించాలని పరిశ్రమలను ఆదేశించాలని భావిస్తున్నారు. అన్ని సాఫ్ట్ డ్రింక్ లలోనూ సుగర్ స్థాయిని కంపెనీలు స్వచ్ఛందంగా 20 శాతం తగ్గించేవిధంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయించేవిధంగా ఆదేశాలివ్వాలని, ఇళ్ళవద్ద పిల్లలు చురుగ్గా ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సలహా ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తానికి భలే రూలండి బాబూ అంటూ నెట్ లో కామెంట్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: అతడిని నమ్మిన పాపానికి ... ఆ అమ్మాయిని 50 వేలకు అమ్మేసాడు!

ఇవి కూడా చదవండి: ఈ హీరోయిన్ కు విమానంలో కూడా లైంగిక వేధింపులు

English summary

Britain Government was taken a sensational decision to decrease obesity cases from its country and they were going to put tax on who have big belly. The government also ordered the companies to reduce sugar quantities in its products.