ఆ రికార్డు కోసం గెడ్డం పెంచిన భామ

Britain Lady Harman Kaur Won Guinness World Record

11:29 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Britain Lady Harman Kaur Won Guinness World Record

మగవాళ్లు గడ్డం పెంచుకోవటంలో వింతేమీ లేదు. గెడ్డాలు - మీసాలు అబ్బాయిలకేనా మాకు కాదా అంటే ఏమి చేస్తాం. అలాగని ఆడవాళ్లు నిజంగా గెడ్డం పెంచుకుంటే? పైగా గిన్నిస్ రికార్డులకూ ఎక్కితే? అలాంటి అరుదైన రికార్డునే బ్రిటన్ కు చెందిన సిక్కు మోడల్ హర్మాన్ కౌర్ సొంతం చేసుకుంది. ఆరు అంగుళాల పొడవైన గడ్డంతో కనిపించే ఆమె ముఖం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యంచేయకుండాగిన్నిస్ బుక్ వాళ్లూ రికార్డు ఇచ్చేశారు. 24 ఏళ్ల 282 రోజుల వయసులో హర్మాన్ కౌర్ దీన్ని సాధించారని, దీనికి ముందు ఆమె ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారని గిన్నిస్ ప్రశంసా పత్రం పేర్కొంది. తనకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కటంపై హర్మాన్ కౌర్ హర్షం వ్యక్తం చేసింది.

1/6 Pages

పెదవుల మీద, గడ్డంపై వెంట్రుకలు గల మహిళల్లో విశ్వాసం పాదుకొల్పటానికిది తోడ్పడగలదని కూడా కౌర్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంతకీ విచిత్రం ఏమంటే, హర్మాన్ కౌర్ కు అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ) ఉంది. ఈ సమస్య గలవారికి మీసాలు, గడ్డం మొలుస్తుంటాయి. కౌర్ కు యుక్తవయసు నుంచే గడ్డం, మీసాలు పెరగటం ఆరంభించింది. దీంతో తోటిపిల్లలు వేధించేవారు. మొదట్లో బిడియపడినా వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవాన్ని గ్రహించి , నలుగురిలో ధైర్యంగా తిరగటం మొదలు పెట్టింది.

English summary

Britain Lady Harman Kaur Won Guinness World Record.