మహారాణి బ్యాగ్ ఖరీదు 2 లక్షలు

Britain Queen Elizabeth handbag cost is 2 lakhs

09:58 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Britain Queen Elizabeth handbag cost is 2 lakhs

ఏదో లేడీస్ హాండ్ బ్యాగ్ అనుకుంటాం కానీ దాని ఖరీదు అక్షరాలా రెండు లక్షలట. మరి మహారాణి కదా... ఆ మాత్రం ఉండాలి మరి.. సాధారణంగా లేడీస్ డ్రెస్ కు తగ్గట్టు బ్యాగులు కొనుక్కోవడం.. వాటిల్లోనూ డిజైనర్‌ తరహాలకూ వెళ్లడం చూస్తుంటాం.. బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ కూడా అంతే.. ఆమెకు 'లానెర్‌ లండన్‌' బ్రాండ్‌ బ్యాగులంటే తెగ ఇష్టమట. అందుకే ఆ బ్రాండ్‌ నుంచే రకరకాల రంగులూ, మోడళ్లలో ఏకంగా రెండువందల బ్యాగులు కొనుక్కున్నారట. సందర్భాలకు తగ్గట్టూ ఎంపిక చేసుకుంటారట. ఒక్కో బ్యాగు ఖరీదు 1650 యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో పన్నెండు లక్షల రూపాయలు.

ఏడాదికి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి ఆ సంస్థకు ఐదు హ్యాండుబ్యాగుల ఆర్డరు వస్తుందట. ఎందుకోగానీ కిందటేడాది మాత్రం రెండు బ్యాగులు సరిపోతాయన్నారట మహారాణి. ‘హ్యాండిళ్లు పొడుగ్గా ఉండాలి, ముఖ్యంగా ఎదుటివారికి షేక్‌హ్యాండ్‌ ఇస్తున్నప్పుడు ఈ బ్యాగు వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకూడదు!’ అని షరతులు విధిస్తారట. ఎలిజబెత్‌ రాణి తలస్తే బ్యాగులకి కొదవేముంది.....

English summary

Britain Queen Elizabeth handbag cost is 2 lakhs. Britain queen Elizabeth hand bag cost is 2 lakhs.