నేతాజీ ఫైళ్లు విడుదల చేసిన బ్రిటన్ సైట్

Britain Website Releases Papers Detailing Netaji

04:49 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Britain Website Releases Papers Detailing Netaji

ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కీలక పత్రాలను ఒక బ్రిటన్ వెబ్ సైట్ ఆన్ లైన్ లో పెట్టింది. బోసు చనిపోయారని చెప్తున్న విమాన ప్రమాదం తర్వాత కొన్నేళ్లకు ఆయన చైనాలో కనిపించారన్న వాదనలను తిరస్కరించేలా ఈ ఫైళ్లలోని అంశాలు ఉన్నాయి. వీటిని WWW.BOSEFILES.INFO అనే వెబ్‌సైట్‌లో ఉంచారు. 1952లో బోసు చైనాలో కనిపించారన్న వార్తలను ఖండిస్తూ బీజింగ్‌లోని భారతీయ ఎంబసీ పంపించిన ఒక టెలిగ్రామ్‌ను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. 1945లో తైవాన్‌లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో బోసు చనిపోయారని భావించారు. అయితే 1952లో ఎస్‌ఎం గోస్వామి అనే బోసు అభిమాని నేతాజీ మిస్టరీ వీడింది అనే శీర్షికతో ఒక కరపత్రం వెలువరించారు. అందులో మంగోలియన్ వాణిజ్య ప్రతినిధి బృందం చైనా అధికారులతో ఉన్న ఒక ఫొటోను ముద్రించారు. అందులో ఉన్న ఒక వ్యక్తి బోసేనని ఆయన పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు హాజరై, ఆ ఫొటోను చూపిస్తూ ఆయన బతికే ఉన్నారని వాదించారు. దీనిని ధ్రువీకరించుకునేందుకు ఆ ఫొటోను బీజింగ్‌లోని భారతీయ ఎంబసీకి పంపించగా, ఆ ఫొటోలో ఉన్నది బోసు కాదని తిరుగు సమాధానం వచ్చింది.

English summary

A UK-based website set up to chart the last days of Netaji Subhas Chandra Bose has released documents relating to the day before his plane crashed in August, 1945.