ప్రభాస్ పై మనసు పారేసుకున్న బ్రిటీష్ బ్యూటీ

British beauty Amy Jackson want to act with Prabhas

03:05 PM ON 14th April, 2016 By Mirchi Vilas

British beauty Amy Jackson want to act with Prabhas

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్.. 'బాహుబలి' రిలీజై ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన తరువాత ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక బాహుబ‌లి అనేక విదేశీ భాష‌ల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాత సినిమాలు కూడా ఇటు నార్త్ అటు సౌత్‌లో అనేక భాష‌ల్లోకి డ‌బ్ అవుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్‌కు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ప్రభాస్‌తో నటించేందుకు అందాల భామలు తెగా ఉత్సాహం చూపిస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో బ్రిటిష్ మోడల్, 'ఐ' ఫేమ్ అమీ జాక్సన్ చేరింది. తనకు ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది. బాహుబలిలో ప్రభాస్ ను చూసి అతనికి ఫ్యాన్ అయిపోయానని చెబుతోంది. కేవలం అమీ యే కాక, దేశ వ్యాప్తంగా ఎంతో మంది హీరోయిన్స్ ప్రభాస్ సినిమాలో చేయాలనుకోవడం విశేషం. అమీ జాక్సన్ ప్ర‌స్తుతం ర‌జ‌నీ-శంక‌ర్ 'రోబో 2.0' సినిమాలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్‌వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. “ప్రభాస్ ఇండియన్ ఐకాన్ అని, అవకాశం వస్తే అతనితో ఖచ్చితంగా నటిస్తానంటూ” చెప్పుకొచ్చింది. అమీ తెలుగులో రామ్ చరణ్ 'ఎవ‌డు' సినిమాలో కూడా న‌టించింది.

ఆ తరువాత మరే తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. మరి ఫ్యూచర్ లో ఈ పిల్లికళ్ల సుందరికి ప్రభాస్ ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

English summary

British beauty Amy Jackson want to act with Prabhas. Hot bikini beauty Amy Jackson want to act with Prabhas.