హైజాకర్‌తో సేల్ఫీ

British Man Takes Photo With Hijacker

12:11 PM ON 30th March, 2016 By Mirchi Vilas

British Man Takes Photo With Hijacker

ఎవరి పిచ్చి వారిదని ఊరికినే అంటారా...తమకి ఇష్టం వచ్చినట్లు ఏవేవో పిచ్చి పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కేస్తున్నారు. తాజాగా అలంటి సంఘటనే మరొకటి జరిగింది. ఒకరు ఏమో తన మాజీ ప్రియురాలిని కలిసేందుకు ఒక అంతర్జాతీయ విమానాన్నే హైజాక్ చేస్తే , మరొకరు హైజాకర్ తో ఫోటో తీసుకుని వార్తల్లో నిలిచారు.

ఇది కూడా చూడండి : భరద్వాజ్ పెళ్లి పుకారే....

ఇంతకి అసలు విషయానికి వస్తే ఈజిప్ట్ కు చెందిన సైఫ్‌ ఎల్‌ డిన్‌ ముస్తాఫా ఒక వ్యక్తీ తన మాజీ ప్రియురాలిని చూడాలనిపించి ఏకంగా ఒక విమానాన్ని హైజాక్ చేసాడు. ఆ విమానాన్ని తన మాజీ ప్రియురాలు ఉన్న చోటికి తీసుకువెళ్ళాలని ఆ విమాన సిబ్బందిని భయ బ్రన్తులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటె విమానాన్ని హైజాక్ చేసిన వ్యక్తి ని చూసి ఎక్కడ తన నడుముకు ఉన్న బాంబు ను పెల్చేస్తాడో అని ప్రయాణికులందరూ భయపడుతుంటే , బెంజిమిన్‌ ఇన్స్‌ అనే బ్రిటన్ కి చెందిన ప్రయాణికుడు మాత్రం ధైర్యం చేసి నేరుగా ఆ హైజాకర్ దగ్గరకు వెళ్ళి అతనితో కలిసి ఒక సేల్ఫీ దిగి నేరుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు . అందరూ భయపడుతున్నహైజాకర్ పక్కన నించుని నవ్వుతూ అతనితో కలిసి ఫోటో దిగడంతో అతని ధైర్యానికి అతన్ని మెచ్చుకోవాలని కొందరు అంటుంటే మరి కొందరు నేరస్థులతో ఫోటో దిగడం ఎంతని అతని పై మంది పడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఒక్క ఫోటోతో ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయాడు.

ఇవి కూడా చూడండి : అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అయాన్

తన మాజీ ప్రియురాలిని చూడడం కోసం ప్రయాణికులని దాదాపు 10 గంటలు ఇబ్బందులకు గురి చేసిన సైఫ్‌ ఎల్‌ డిన్‌ ముస్తాఫా ను సైప్రస్‌ పోలీసులు అరెస్ట్ చేసారు . దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు . విమానాన్ని హైజాక్ చేసిన సైఫ్‌ ఎల్‌ డిన్‌ ముస్తాఫా ను విచారిస్తున్న పోలీసులు అతడి మానసిక పరిస్థితి సరిగా లేదనండు వల్లే ఇలా చేసి ఉంటాడని చెబుతున్నారు.

ఇది కూడా చూడండి :

ఇంతకీ విమానం హైజాక్ చేసింది ప్రియురాలి కోసమా !!

జూనియర్ ని ఉసుగొల్పుతున్న రోజా

వాట్సాప్ కి కొత్తగా రిప్లై

గిన్నీస్ బుక్ లో సుశీల

English summary

A British passenger Named Benjamin Innes was travelling in Egyptian Airline Flight. One of the person Hijacked that aeroplane to see his ex-girl friend.Benjamin Innes takes photo with the haijacker and posted that photo in his twitter account.Now this photo was going viral in Social Media.