ఇండియాలో బ్రోతల్ హౌస్ లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

Brothel houses in India

01:02 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Brothel houses in India

వ్యభిచారం తప్పని అన్ని మతాలూ, అన్ని సంప్రదాయాలు చెబుతున్నా, అనాదిగా ఓ అనాచారంగా వ్యభిచారం సాగిపోతోంది. కొన్ని వేల కుటుంబాలు దీనివలన దెబ్బతిన్నాయి. అయినా ఒక్కో చోట ఒక్కో పేరుతో యధేచ్చగా నడుస్తోంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వ్యభిచారం అనేది ఉంది. అయితే కొన్ని దేశాల్లో ఈ వ్యభిచారానికి చట్టబద్ధత ఉంటే కొన్ని దేశాల్లో అనధికారికంగా జరుగుతుంటోంది. యూరప్ లోని చాలా దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధం కాగా ముస్లిం దేశాలైన మాల్దీవులు, పాలస్తీనా, ట్యునీషియా, టర్కీ, ఈజిప్ట్, సిరియా లాంటి ఇస్లామిక్ దేశాల్లోనూ వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది.

ఆ క్రమంలోనే.. ఆసియాలోని మరో ముస్లిం దేశం బంగ్లాదేశ్ తాజాగా వ్యభిచార వృత్తికి చట్టబద్ధత కల్పించింది. ఆ దేశంలో 200 ఏళ్లుగా కొనసాగుతోన్న వేశ్యావాటిక విషయంలో బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాకు కొద్ది దూరంలో కొలువైన కందపార వేశ్యావాటిక.. 2,000 మంది సెక్స్ వర్కర్లతో ఆసియా ఖండంలో అతి పెద్ద బ్రోతల్ ఏరియాల్లో ఒకటి. బంగ్లాదేశ్ భారత్ లో కలిసి ఉన్నప్పుడు మనదేశంలోని కోల్ కత్తాలోని సోనాగంజ్, తూర్పు బెంగాల్ లోని(ఇప్పటి బంగ్లాదేశ్) కందపార రెడ్ లైట్ ఏరియాలకు దేశవిదేశాల నుంచి విటులు వచ్చేవారు. బంగ్లాదేశ్ అధికారిక ఇస్లామిద్ దేశంగా అవతరించినప్పటికీ కందపార మనుగడ కొనసాగింది.

ఈ కందపారలో వ్యభిచార వృత్తిలో తరాలుగా కొనసాగుతూ పిల్లలు, మనుమరాళ్లు కలిగిన ఎంతో మంది మహిళలు ఇక్కడ దర్శనమిస్తారు.

ఇండియాలోనూ వేశ్యా వాటికలు ఎక్కువే..

ఇక భారత్ లోనూ చట్టబద్ధం కానప్పటికీ వేశ్యావాటికల సంఖ్య ఎక్కువేనట. మనదేశంలో అతిపెద్ద వేశ్యావాటికలు: సోనాగంజ్(కోల్ కత్తా- 11 వేల మంది సెక్స్ వర్కర్లు), కామాటిపురా(ముంబై- 5,000 మంది), బుధ్ వార్ పేట్(పుణే- 5000 మంది), మీర్ గంజ్(అలహాబాద్), జీబీ రోడ్(ఢిల్లీ), చతుర్భుజాస్థాన్(ముజఫర్ పూర్), ఇట్వారీ(నాగపూర్), శివదాస్ పూర్(వారణాసి) పేరున్న పెద్ద వేశ్యావాటికలుగా చెబుతుంటారు.

English summary

Brothel houses in India