చెల్లి చనిపోయిందని అన్నయ్య ఆత్మహత్య..

Brother and Sister suicide in Eluru

09:35 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Brother and Sister suicide in Eluru

అన్నా-చెల్లెళ్ళ బంధానికి వెల కట్టలేం... అపురూపమైన ఈ పేగు బంధానికి నిర్వచనం చెప్పలేం.... అలాంటి ఓ చెల్లి ఇక లేదని తెలిసి తల్లడిల్లిపోయిన ఓ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయవిదారకమైన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. కేవలం ఓ రోజు వ్యవధిలో కూతురు, కొడుకును కోల్పోయిన ఇక ఆ తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం, ఏలూరు చోడిదిబ్బకు చెందిన బరగడ యామిని మంగళవారం సాయంత్రం స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి పార్వతి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యామిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

నగరంలోనే బీటెక్ చదువుతున్న యామిని మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె అన్నయ్య వర ప్రశాంత్ తీవ్ర ఆవేదన చెందాడు. బుధవారమంతా చెల్లెలి కర్మకాండల్లో పాల్గొన్న ప్రశాంత్ కి చెల్లెలి జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే వున్నాయి. ఇక అంతే ఆ తర్వాత అతడు ఇంటికి చేరలేదు. చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఇలా కూతురు, కొడుకు ఒకరి తరువాత మరొకరు ఆత్మహత్యకు పాల్పడి, ఆ తల్లికి తీరని వ్యధ మిగిల్చారు.

English summary

Brother and Sister suicide in Eluru. In Eluru a girl get suicide for her mother was threatened after that her brother also get suicide.