వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతన్ని తండ్రి ఏం చేసాడో తెలుసా?

Brother illegal affair with sister in law

05:45 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Brother illegal affair with sister in law

కన్నతల్లిలా చూడవలసిన వదినని కామంతో చూసాడో కామాంధుడు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతనికి తగిన శాస్తే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి రమేష్(23) అనే యువకుడు కొంతకాలంగా తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధం తెలుసుకున్న ఆమె మామ కేతిరి సమ్మయ్య(55) రమేష్ ను శనివారం ఉదయం గ్రామంలోని చెరువు సమీపానికి తీసుకెళ్ళి గొడ్డలితో నరికి చంపాడు. సమ్మయ్య, మృతుడి(రమేష్)కి సొంత పెదనాన్న.

రమేష్ ను చంపిన అనంతరం సమ్మయ్య స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సమ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary

Brother illegal affair with sister in law