ఆస్తి కోసం సొంత మరదలినే రేప్ చేసిన కిరాతకుడు

Brother in law rapes his sister in law for properties

05:17 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Brother in law rapes his sister in law for properties

ఒక పక్కన పెళ్లైంది.. పైగా భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. కానీ ఆస్తి కోసం మరదలినే రేప్ చేసాడు.. వివరాల్లోకి వెళితే.. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎంపిక కావడంతో ఇక్కడ ఏరియాలో ఆస్తులు, భూముల రేట్లు భారీ ఎత్తున పెరిగిపోయాయి. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఊహించని రీతిలో ఆస్తులు రేట్లు రెట్టింపు కావడంతో చాలా మంది ఇతర ప్రాంతాల యువకులు సైతం ఈ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి మేనమామ ఇంట్లోనే పెరిగిన ఓ వ్యక్తి అమరావతిలో ఆస్తుల కోసం మేనమూమ కూతురు జీవితాన్నే నాశనం చేయడానికి సైతం వెనుకాడలేదు.

చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగిన ఆ నింధితుడు ఆమెకు అమరావతిలో భారీ ఎత్తున ఉన్న భూములను సొంతం చేసేందుకు దుర్మార్గపు కుట్రకు తెరలేపాడు. నింధితుడికి వివాహం కూడా అయ్యింది. అంతే కాదు అతడి భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే అమరావతిలో తన మరదలికి ఉన్న విలువైన భూముల పై కన్నేసిన అతడు వాటి కోసం మరదలిని రెండో పెళ్లి చేసుకుంటానని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. అందుకు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ ప్రగతినగర్లో ఉంటున్న మరదలి ఇంటికి చేరుకున్న నింధితుడు ఆమె మెడ పై కత్తి పెట్టి ఆమెను రేప్ చేశాడు.

అత్యాచారం చేసిన సమయంలో వాటిని వీడియో కూడా తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెధిరించాడు. చివరకు పోలీసుల విచారణలో తాను అమరావతి ఏరియాలో తన మరదలికి ఉన్న ఆస్తుల పై కన్నేసే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. పోలీసులు నింధితుడి పై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary

Brother in law rapes his sister in law for properties