అబ్బాయిలతో సన్నిహితంగా ఉందని చెల్లిని హత్య చేసారు

Brothers killed sister in Haryana

11:57 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Brothers killed sister in Haryana

అన్నాచెల్లెలు బంధమంటే చెల్లెల్ని అన్న ఎప్పుడూ వెన్నంటే ఉండి కాపాడటం. ఈ బంధం ఎంతో గొప్పది. అలాంటిది ప్రాణంగా చూసుకోవాల్సిన తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు అన్నలు కలిసి చంపేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు మద్యం సేవించి, ఫుల్లుగా తాగి ఉన్న కొందరు యువకులతో కలిసి అసభ్యకరమైన భంగిమలో ఉండటాన్ని చూసి తట్టుకోలేని ఆ ముగ్గురు అన్నలు ఆగ్రహంతో రగిలిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనా వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ జిల్లా బిధాల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రీతి ఇంట్లోనే తాగేసి కొందరు యువకులతో అసభ్యకరమైన రీతిలో ఉండటాన్ని తన ముగ్గురు అన్నలు చూశారు.

అంతే... ఆగ్రహించిన ముగ్గురు అన్నలు ముకేష్, సందీప్, సోనులు చెల్లెలైన ప్రీతికి విషం ఇచ్చి హతమార్చారు. ఆపై చెల్లెలు మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా దహనం చేశారు. ఈ ఘటనపై బుధియా గ్రామ సర్పంచి ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన పోలీసులు నింధితులైన ముకేష్, సందీప్ లను అరెస్టు చేశారు. ఆ అమ్మాయి అలా చెయ్యటం తప్పు, వీళ్ళు ఇలా చెయ్యటం ఇంకా పెద్ద తప్పు. ఎంత తప్పు చేసిన చెల్లెల్ని క్షమించాల్సిన అన్నలే ఇలా చెయ్యడం తప్పని కొందరు తప్పు పడుతున్నారు..

ఇది కూడా చదవండి: ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

ఇది కూడా చదవండి: ఇండియా క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే అమ్మల్ని గదిలోకి పంపాల్సిందేనట!

ఇది కూడా చదవండి: ప్యాకేజీపై పంఛ్ పేలింది

English summary

Brothers killed sister in Haryana. 3 brothers killed their sister for she is romancing with some people in home.