ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

Brutal mother murdered her daughter for facebook lover

11:34 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

Brutal mother murdered her daughter for facebook lover

అవును మీరు చూస్తుంది నిజమే.. తల్లీకూతుళ్ళు ఇద్దరూ కలిసి ఒక్కడినే ప్రేమించారు. దీంతో ఆ తల్లి తన కూతుర్ని ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఆ వివరాల్లోకి వెళితే.. మంజు అనే 37 ఏళ్ల వివాహితకు దీక్ష అనే 17 ఏళ్ల కూతురు ఉంది. అయితే.. మంజుకి ఫేస్ బుక్ ద్వారా సౌదీ అరేబియాలో ఉండే విజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2015 అక్టోబర్ లో వీరి పరిచయం కాగా.. ఆ పరిచయం ప్రేమగా దారి తియ్యడంతో.. డిసెంబర్ లో విజయ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. జనవరి నుంచి మంజు ఇంట్లోనే ఉంటూ విజయ్ మంజుతో సహజీవనం చేసేవాడు. ఈ క్రమంలో వయసులో ఉన్న ఆమె కూతురు దీక్ష పై కన్ను వేసాడు.

దీక్షతో విజయ్ బాగా క్లోజ్ గా ఉండడంతో.. దీక్ష కుడా అతన్ని ప్రేమించింది. అయితే.. తన తల్లితో అతనికి ఉన్న సంబంధం ఓ రోజు రాత్రి బయట పడింది. ఈ విషయంలో దీక్ష తన తల్లితో గొడవ పడింది. తాను విజయ్ ని ఘాడంగా ప్రేమిస్తున్నట్లు తల్లితో చెప్పింది. ఈ విషయంలో వీరి మధ్య గొడవ మొదలైంది. విజయ్ పేరును దీక్ష తన చేతి పై పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. దీనితో తన ప్రియుడైన విజయ్ ను తన కూతురు దీక్ష ఎగరేసుకుపోతుందన్న భయంతో మంజు ఒక దారుణమైన పన్నాగం పన్నింది. అదేంటంటే తన కూతుర్ని చంపేందుకు పన్నాగం పన్ని.. గత నెల ప్రియుడితో కలిసి 24న ఫ్యాన్ కు ఉరివేసి దీక్షను చంపేశారు.

కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా దీక్ష పేరుతో విజయ్ సూసైడ్ నోట్ రాసి పెట్టేసాడు. ఆమె తల్లి కుడా పోలీసులను నమ్మించాలని చూసింది. దీక్ష చేతి పై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారి సంబంధం పై ఆరా తీసారు. తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజం వాళ్ళ చేత కక్కించారు.

మరిన్ని వివరాలకోసం క్రింది స్లైడ్స్ చెక్ చేయండి.

1/4 Pages

దీక్ష (17)

English summary

Brutal mother murdered her daughter for facebook lover