విమాన కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం 

BSF Aeroplane Accident

12:38 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

BSF Aeroplane Accident

దక్షిణ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్ఎఫ్ కి చెందిన సూపర్ కింగ్ విమానం మంగళవారం ఉదయం కూలిన ఘటనలో 10 మంది బిఎసెఫ్ సిబ్బంది దుర్మరణం చెందారు. పౌర విమానయాన సహాయ మంత్రి ఈ విషయం దృవీకరించారు.

రాంచీ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. మరణించిన పది మందిలో 7గురు అధికారులు , ముగ్గరు సాంకేతిక నిపుణులు వున్నారు. కేంద్ర హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ , గవర్నర్ నజీబ్ ఘటనా స్థలిని పరిశీలించారు.

కాగా ఢాకాలో జరగాల్సిన భారత్ - బంగ్లాదేశ్ డిజిల సమావేశం వాయిదా పడింది. విమాన ప్రమాదం కారణంగానే ఈ సమావేశం వాయిదా వేసారు.

English summary

Today morning BSF aeroplane named SuperKing has crashed while take-off in delhi. In this accident 10 members including 7 BSF officials were died