డిల్లీలో కూలిన బిఎసెఫ్ విమానం 

BSF Aeroplanes Crashed

11:26 AM ON 22nd December, 2015 By Mirchi Vilas

BSF Aeroplanes Crashed

మంగళవారం రెండు చోట్ల విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకటి బిఎసెఫ్ విమానం కాగా , రెండవది రన్ వే మీద వున్న విమానం. ఒక ప్రమాదంలో నలుగురు మరణించగా , మరో ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

వివరాలలోకి వెళితే , దక్షిణ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్ఎఫ్ కి చిందిన సూపర్ కింగ్ విమానం మంగళవారం ఉదయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అంటున్నారు. అయితే ఇందులో 12 మంది జవాన్లు వున్నట్ట చెబుతున్నారు. సాంకేతిక నిపుణులను రాంచీ తీసుకెళ్తుండగా టే కాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.ఘటనా స్థలికి 15 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి.

కోల్కత్తా ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని డీ కొట్టిన బస్ ....

కాగా కోల్‌కత్తా విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 6.30 గంటలకు ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్‌వేస్‌‌కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బస్సులో ప్యాసింజర్స్ ను విమానం వద్దకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలుపాలవండగానీ చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సు మరింత వేగంగా వచ్చి విమానాన్ని ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. కారణాలపై విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సమాచారం లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తమ ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్‌కు వెళ్లాల్సి ఉంది.

English summary

Two Border security force aeroplane crashed in delhi. In this incident total 4 members were died