బీఎస్ఎన్ఎల్ షాకింగ్ ఆఫర్: 2 రూ.లకే నెలంతా ఫ్రీ కాల్స్!

BSNL bumper offer

05:32 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

BSNL bumper offer

జియో ఆఫర్ లతో టెలికం కంపెనీల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ షాకింగ్ ఆఫర్ ప్రకటించనుంది. ఇప్పటికే రిలయన్స్ జియోకు సైతం షాకిస్తూ, రూ. 249కి అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ కస్టమర్లు వాడుకునేలా 2జీ, 3జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా ఇవ్వాలని దీనికి రెంట్ అత్యంత నామమాత్రంగా రూ. 2 నుంచి రూ. 4 మాత్రమే ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా, 2జీ, 3జీ వినియోగదారులు ఉచిత కాల్స్ ను ఏ నెట్ వర్క్ కైనా చేసుకోవచ్చని..

తొలి దశలో సంస్థ నెట్ వర్క్ మెరుగ్గా ఉండే హిమాచల్ ప్రదశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ను తీసుకువస్తామని, ఆపై దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జియో ఆఫర్లు 4జీ సపోర్ట్ చేసే ఫోన్లపైనే పనిచేస్తే.. బీఎస్ఎన్ఎల్ తన తాజా ఆఫర్ ను అమలు చేస్తే, ఇండియాలోని ఏ మొబైల్ ఫోన్ నుంచైనా బీఎస్ఎన్ఎల్ సిమ్ తో ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కాగా, ఈ అతి తక్కువ చార్జ్ ఆఫర్, మరో ఇంటర్నెట్ ప్యాక్ తో బండిల్డ్ రూపంలో రావచ్చని టెలికం నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: దసరా స్పెషల్: 'సువర్ణరథం' ఎక్కడానికి 30 వేలు చాలు!

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే ఏ అమ్మాయైనా మీకు పడాల్సిందే!

ఇది కూడా చదవండి: సంచలనం రేపుతున్న 'తూనీగ తూనీగ' హీరోయిన్ న్యూడ్ ఫోటోలు!

English summary

BSNL bumper offer. Bharat Sanchar Nigam Limited telephone network announcing that free calls for monthly is only 2 rupees to 4 rupees.