రూపాయికే 1జిబి... రిలయన్స్ జియోకి జర్క్ ఇచ్చిన బీఎస్ ఎన్ ఎల్.

Bsnl Offers 1GB Internet For Only Rupee One

11:02 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Bsnl Offers 1GB Internet For Only Rupee One

ఎవరు మార్కెట్ ని కాపాడుకోడానికి వాళ్ళు పరితపిస్తుంటారు. అయితే కొందరు ఇచ్చే షాక్ కారణంగా కొంతమంది కుదేలవుతారు. కానీ దాన్నుంచి తేరుకుని బెటర్ ఆఫర్ ప్రకటిస్తే మాత్రం షాకి ఇచ్చిన వాళ్లకు తిరిగి షాక్ తగులుతుంది. ఇప్పుడు అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సేవలందిస్తున్నట్లు ప్రకటించి టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో కొత్త ఒరవడికి నాంది పలికింది కదా. 50 రూపాయలకే 1జిబి 4జీ డేటా అందిస్తున్నట్లు ప్రకటించి ముఖేష్ అంబానీ టెలికామ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిర్ టెల్, ఐడియాకు నిమిషాల వ్యవధిలో నష్టాలను మిగిల్చారు.

సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్ ప్రకటించడం, వాయిస్ కాల్స్ మొత్తంగా ఫ్రీగా చేసుకోవచ్చని అనడంతో దేశమంతా దీని గురించే చర్చించింది. అదెలా సాధ్యమంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. రిలయన్స్ జియోను తట్టుకుని టెలికామ్ రంగంలో తమ స్థానాన్ని కాపాడుకోవడం ఎలా అని ఇతర ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని కంపెనీలు గల్లంతవుతాయని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజా ప్రకటన మరో సంచనానికి తెరలేపింది.

రిలయన్స్ జియోకు ధీటుగా 249 రూపాయలకే నెల రోజుల కాలపరిమితితో అపరిమిత ఇంటర్నెట్ ను అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు, 50 రూపాయలకు 1జిబి అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియోకు పోటీగా 1 రూపాయికే 1జిబి అందిస్తామని బీఎస్ ఎన్ ఎల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 1జీబీ ఉన్న ఫైల్ డౌన్ లోడ్ చేసుకుంటే కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని బీఎస్ ఎన్ ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాత్సవ ప్రకటించారు.

అయితే ఈ అపరిమిత డేటా ఆరునెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నిర్దిష్ట చార్జీలు వర్తిస్తాయని ఆయన అంటున్నారు. కేవలం బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని శ్రీవాత్సవ చెప్పారు. 2ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ అపరిమిత డేటా సేవలు వినియోగదారులు పొందగలరని సీఎండీ శ్రీవాత్సవ సూచించారు. ఎవరి ఉనికి వాళ్ళు కాపాడుకోవాలి కదా మరి.

ఇవి కూడా చదవండి:ఎపి సీఎం చంద్రబాబు గురించి తెలీని నిజాలివే

ఇవి కూడా చదవండి:అగ్ర రాజ్య నేతకు షాకిచ్చిన చైనా

English summary

Recently Mukesh Ambani announces his new network Reliance Jio and the prices of the Reliance Jio Network. Jio works only on 4G network. Due that announcement so many telecom operators gets huge loss and now Bsnl offers 1GB of internet for just One Rupee.