ఇదేనా కలాంకు ఇచ్చే గౌరవం..!

BSNL Sends Bill To Kalam

01:49 PM ON 5th December, 2015 By Mirchi Vilas

BSNL Sends Bill To Kalam

భారత మాజీ రాష్ట్రపతి, శ్రాస్త్రవేత్త , దివంగత ఎ.పి.జే. అబ్దుల్‌కలాం దేశానికి చేసిన సేవ గురించి వేరే చెప్పకర్లేదు. కలాంను మిస్సైల్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా అని కూడా పిలుచుకుంటాం . భారత శాటిలైట్‌ రంగానికి కలాం చేసిన సేవలు అటువంటివి. భారత్‌ దేశానికి ప్రపంచస్ధాయి లో గుర్తింపు రావడంతో కీలక పాత్ర వహించిన కలాంకు ఆయన మరణించిన తరువాత భారత ప్రభ్వుతం సరిగా గౌవవించడం లేదనే చెప్పాలి.

మొన్నటికి మొన్న కలాం చివరి వరకు నివసించిన ఢిల్లీలోని ఆయన నివాసాన్ని ఒక స్మారక భవనంగా చెయ్యాలంటూ కలాం బంధువులు చేసిన విజ్ఞప్తిని పక్కన బెట్టి ఒక కేంద్ర మంత్రికి ఆ భవనాన్నిగెస్ట్ హౌస్ గా కేటాయించింది. దీంతో కలాం సోదరడి కొడుకు బిజేపి కి రాజీనామా కూడా చేసాడు. తాజాగా భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్ధ అయిన భారత్‌ సంచార్‌ నిఘమ్‌ లిమిటెట్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) సంస్ధ కలాం ఫోను బిల్లు కట్టలేదంటూ తక్షణమే బిల్లును చెల్లించాలంటూ నోటిసులు జారిచేసింది.

వివరాలోని వెళ్తే ఐదు సంవత్సరాల క్రితం కేరళలోని తిరువనంతపురం పర్యటనలో భాగంగా కేరళ రాజ్‌భవన్‌లో కలాం బస చేశారు. ఈ పర్యటనకు సంబంధించినది ఈ బిల్లు.

ఇంతకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం బకాయి పడ్డ సొమ్ము ఎంతో తెలుసా కేవలం 1029 రూపాయలు మాత్రమే. దీని పై బిఎస్‌ఎన్‌ఎల్‌ నోటిసులు జారీ చేసింది అంతేకాక ఒక వేళ నోటీసులకు స్పందించని పక్షంలో కలాం కు చెందిన ఆస్తులను జప్తు చేయ్యాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులను ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న కేరళ రాజ్‌భవన్‌ వర్గాలు ఆ బిల్లును తాము చెల్లిస్తామని తెలిపాయి.

భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపడంలో తనదైన శైలిలో సేవ చేసిన కలాంకు భారత్‌ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ యావత్తు దేశం ప్రశ్నిస్తోంది.

English summary

Indian government telecom organisation BSNL sends notices to Recently dead abdul kalam. People in inida were saying that government of india not respecting Apj Abdul Kalam