4జీకి దీటుగా.. 40 వేల హాట్ స్పాట్స్

BSNL to Set Up 40,000 Wi-Fi Hotspots

04:49 PM ON 6th January, 2016 By Mirchi Vilas

BSNL to Set Up 40,000 Wi-Fi Hotspots

ప్రస్తుతం దేశంలో మొబైల్ వార్ నడుస్తోంది. 2జీ, 3జీ, 4జీ అంటూ టెలికాం ఆపరేటర్లు దూసుకుపోతున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం ఈ రేస్ లో వెనుకబడిపోతోంది. దీంతో వీరి పోటీని తట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. 4జీ కంటే వేగంగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 40,000 వైఫై హాట్‌స్పాట్లను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, రిలయన్స్‌ సంస్థలు ఇప్పటికే 4జీ సేవలు ప్రారంభించాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ వద్ద 4జీ స్పెక్ట్రమ్‌ లేకపోవడంతో ఈ సేవలు అందించలేకపోతున్నట్లు సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడేందుకు 4జీ కంటే వేగంగా ఇంటర్నెట్‌ను అందించేలా దేశవ్యాప్తంగా 40,000ల వైఫై హాట్‌స్పాట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

English summary

Government Of India telecom sector BSNL said on Monday it is working on setting up 40,000 Wi-Fi Hotspots in the country to counter its inadequacy in providing 4G data services.