పొగ రాయుళ్లకు బడ్జెట్ లో షాక్

budget shock for cigarette smokers

11:37 AM ON 2nd February, 2017 By Mirchi Vilas

budget shock for cigarette smokers

కేంద్ర బడ్జెట్ లో కొన్ని వస్తువులపై పన్ను విధించగా, మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చారు. ఈలెక్కన చూస్తే, 2017-18 బడ్జెట్లో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచారు. పొగరాయుళ్లు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారు వాటికి మరింత దూరం జరిగేలా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పొగాకు ఉత్పత్తులు మరింత ప్రియంకానున్నాయి. మరోవైపు స్వచ్ఛ ఇంధన వనరులను మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా సోలార్ టెంపర్డ్ గ్లాసులు, ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి పరికరాలు, పవన విద్యుత్ జనరేటర్లపై పన్నులు తగ్గించారు.

రేట్లు పెరిగే వస్తువులను పరిశీలిస్తే ...

సిగరెట్, పాన్ మసాలా, చుట్టలు, బీడీలు, నమిలే పొగాకు.

ఎల్ఈడీ సంబంధిత లైట్లు

జీడిపప్పులు (వేయించి ఉప్పుపెట్టినవి)

అల్యూమినియం ఉత్పత్తులు

పాలిమర్ టేపులు

వెండి నాణేలు, పతకాలు

మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు

రేట్లు తగ్గే వస్తువులను చూద్దాం ...

ఆన్లైన్ టికెట్ బుకింగ్

లిక్విడ్ సహజ వాయువులు

ఇళ్లలో ఉపయోగించే ఆర్వో ప్లాంట్ల భాగాలు

సౌరవిద్యుత్ కోసం ఉపయోగించే సోలార్ టెంపర్డ్ గ్లాసులు

ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి పరికరాలు

విండ్ పవర్ జనరేటర్లు

తోలు ఉత్పత్తుల్లో ఉపయోగించే చర్మశుద్ధి పదార్థాలు

పీవోఎస్ మెషీన్స్ కార్డులు, ఫింగర్ ప్రింట్ రీడర్లు

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

ఇది కూడా చూడండి: టీవీలోంచి దెయ్యం బయటికి వచ్చేసిందట మరి అప్పుడు ఏం ఏమైందో తెలుసా ?

English summary

Shock for all cigarette smokers, cigarette cost increases by union budget minister.