టాయ్లెట్ కట్టుకుంటే 'కబాలి' టికెట్ ఫ్రీ

Build Toilets And Get Kabali Tickets In Kerala

10:31 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Build Toilets And Get Kabali Tickets In Kerala

అవునా ఇదేమిటి అనుకుంటున్నారా, నిజం.. ఎందుకంటే, ప్రభుత్వం చేసేదానికన్నా హీరోలు చెప్పేదానికి ఎక్కువ విలువ అన్నట్లు న్న ప్రస్తుత పరిస్థితి గురించి అందరికీ తెల్సిందే. దీన్ని ఆయుధంగా మలచుకుంటే తిరుగు ఉండదు. పుదుచ్చేరిలోని ఓ జిల్లా కలెక్టరు సరిగ్గా అదే చేస్తున్నారు. ప్రజలకు సినీ నటులన్నా, సినిమాలన్నా ఎంతిష్టమో తెలిసిన ఆ కలెక్టర్ ఆ ఇష్టాన్నే తన లక్ష్య సాధనకు వాడుకున్నారు. ఏదో అల్లా టప్పాగా కాకుండా ఏకంగా రజినీ కాంత్ సినిమానే ఆయన ఎంచుకున్నారు. ప్రభుత్వ సేవలను ఉపయోగించుకునేవారికి కబాలి చిత్రం టికెట్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రశంసించారు. పైగా రజినీకాంత్ ను తమ రాష్ట్ర ప్రాస్పరస్ పుదుచ్చేరి పథకానికి ప్రచారకర్తగా పని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం స్వచ్ఛ అభియాన్ పథకం కింద రాష్ట్రంలో 55వేల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి గాను రూ.120కోట్లు కేటాయించింది. ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తూ మరుగుదొడ్లు నిర్మించుకోమంటే ప్రజలనుంచి ఆశించిన స్పందన లేదు. దాంతో దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి వారు తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేలా చేయడానికి అధికారులు రకరకాల మార్గాలు వెదుకుతున్నారు. అందులో భాగంగానే ఓ కలెక్టర్ ఇలా ఉచితంగా కబాలి టికెట్ ఇస్తామని ప్రకటించారు. ఈ కొత్త ఇన్సెంటివ్ బాగానే పనిచేస్తోందని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. రజినీకాంత్ తమ రాష్ట్ర ప్రాస్పరస్ పుదుచ్చేరి పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా పనిచేయాలని ఆమె కూడా కోరారు. మొత్తానికి ప్రభుత్వ పథకాలకు రజనీ సినిమా టికెట్ కు లింకు పెట్టడం ద్వారా మాంచి ఫలితాలు వస్తే అంతకన్నా కావాల్సిందేమి ఉంది. ఈ రకంగా కూడా సూపర్ స్టార్ రజనీ సరికొత్త రికార్డు కొట్టబోతున్నాడు. హేట్సాఫ్ రజనీ..

ఇవి కూడా చదవండి:దొర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:అనసూయ, రేష్మీలను మించిపోయిన మరో హాట్ యాంకర్

English summary

Superstar Rajinikanth was recently acted in Kabali Movie and the expectations on this movie was raising day by day and now one of the collector in Kerala was offered Kabali movie tickets who build toilets.