17 ఏళ్లుగా మెడలో వున్న బులెట్ తొలగింపు

Bullet Stuck In Delhi Minister Gopal Rai Neck For 17 Year

12:14 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Bullet Stuck In Delhi Minister Gopal Rai Neck For 17 Year

ఒకటా రెండా ఏకంగా 17 ఏళ్లుగా అయన మెడలో ఉండిపోయిన బులెట్ ఎట్టకేలకు ఆపరేషన్ ద్వారా తొలగించారు. విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని డిల్లీ రవాణాశాఖ మంత్రిగా పనిచేస్తున్న గోపాల్‌రాయ్‌ కి 1999లో లఖ్‌నవూ యూనివర్శిటీలో జరిగిన విద్యార్థి రాజకీయ వివాదంలో తుపాకీ గాయమైంది. అప్పటి నుంచి ఆయన మెడ లోపలి భాగంలో ఓ బులెట్‌ అలాగే ఉండిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ఏడాదిన్నరపాటు రాయ్‌ పక్షవాతానికి గురయ్యారు. ఎన్నో ఆసుపత్రిల్లో చికిత్స అనంతరం మూడేళ్ల తర్వాత రాయ్‌ పూర్తిగా కోలుకున్నారు. అయితే బులెట్‌ మాత్రం మెడలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స నిమిత్తం రాయ్‌ గురువారం ఆసుపత్రిలో చేరగా.. శుక్రవారం బులెట్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. డిల్లీలోని అపోలో ఆసుపత్రిలో రాయ్‌కు శస్త్రచికిత్స చేసి.. బులెట్‌ను తీసేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాష్ట్రమంత్రి కపిల్‌ మిశ్రా ఆసుపత్రిలో రాయ్‌ని పరామర్శించారు.

ఇవి కూడా చదవండి:అక్కడికి వెళ్తే చావడం ఖాయమా!?( వీడియో)

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఇవి కూడా చదవండి:గాంధీ , వాజ్‌పేయి పక్కన నేను అంటున్న వర్మ

English summary

Delhi Doctors Removed Bullet from Delhi Transport Minister Gopal Rai's Neck After 17 years. In a protest a bullet was strucked in Gopal Rai's Neck. At present he was recovering in Hospital in Delhi.