ఏపి నిరుద్యోగులకు ఇదో గొప్ప అవకాశం!

Bumper offer for AP unemployees

04:54 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Bumper offer for AP unemployees

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతీ ఏడాది ఎంతో మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే వారిలో ఎంత మంది సక్సెస్ అవుతున్నారు, అసలెంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని చూస్తే ఆ సంఖ్య కాస్త తక్కువగానే కనిపిస్తుంది. చాలా మంది బోగస్ కంపెనీలు, బ్యాక్ డోర్లు అంటూ మోసగాళ్ళ వలకి చిక్కి డబ్బుతో సహా ఎంతో విలువైన సమయాన్ని కూడా వృదా చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారి అందరికీ ఓ శుభవార్త. ఉద్యోగాలే మీ వద్దకి నడిచొస్తున్నాయి! దీని కోసం మీరు చేయాల్సింది కూడా చాలా చిన్న పనే, అలా ఒక్కసారి ఫోన్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవటం, దాదాపు ఇండియాలో ఇలాంటి పని జరగటం ఇదే మొదటిసారి.

అయితే గడువు ఎంతవరకూ ఉంది, అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్న విషయాలు 7097298399 నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు, కెరీర్ కౌన్సెలింగ్ కోసం 1800 425 2422 టోల్ ఫ్రీలో సంప్రదించవచ్చు. మొత్తం వీరి దగ్గర 1700 వందల కంపెనీల సమాచారం ఉంది. అంటే ఖచ్చితంగా మెండుగా ఉద్యోగావకాశాలు ఉన్నట్లే, పది పాసైన వారికి తగిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి అని వారు చెప్తున్నారు. దీని ద్వారా జాబ్ ట్రైల్స్ వేసే వారికే కాదండోయ్, కొత్తగా కంపెనీలు పెట్టేవారికీ, మ్యాన్ పవర్ అవసరం అయిన వారికి కూడా ఉపయోగమే. మీలో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు ఉంటే ఇటూ ఓ లుక్కేయండి, కాకపోతే ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

English summary

Bumper offer for AP unemployees