నల్లకుభేరులకు బంపర్ ఆఫర్!

Bumper offer for black money holders

11:42 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Bumper offer for black money holders

పెద్ద నోట్ల రద్దు యవ్వారం చాలామంది సామాన్యులకు ఇంకా కష్టాలు తెచ్చిపెడుతూనే ఉండగా, లెక్కకు మించి డబ్బున్నోళ్లకు ఇబ్బందులు తెస్తోంది. అయితే నెల్లూరు జిల్లాలోని నల్లకుబేరులకు ఓ నేత బంపర్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. వడ్డీలేకుండా పాతనోట్లు ఎంతైనా అప్పుగా తీసుకుంటామని చెప్పారు. తీసుకున్న సొమ్ము రెండేళ్ల తర్వాత తిరిగి ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో ఆ నాయకుడి ఇంటిముందు జనాలు, బడాబాబులు బారులు తీరారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇలాంటి యవ్వారం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, కోస్తా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కూడా నోట్లకట్టలతో ఆ నేత ఇంటి ముందు క్యూలో నిల్చున్నారట.

1/4 Pages

ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా సేకరించినట్లుగా సమాచారం. అయితే ఆ నేత ఎవరు? ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్న విషయం తెలియరాలేదు. ఈ వ్యవహారం దాదాపుగా పదిరోజుల్నుంచి జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే రెండు రోజులు క్రితం వరకు ఆ నేత రూపాయి వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకునేవారట.

English summary

Bumper offer for black money holders