బన్నీ కోరిక వింటే షాకవ్వాల్సిందే!

Bunny want to do guest role in any movie

02:38 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Bunny want to do guest role in any movie

టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ దాటేసిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ పై పడిందట. ఇదేంటి? సరైనోడికి ఈ వింత కోరికేంటి? అనేగా మీ డౌట్. దానివెనుకో ట్విస్ట్ ఉంది. మలయాళ సినీఫ్యాన్స్ లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ వుంది. ఇంకా చెప్పాలంటే, మలయాళ మార్కెట్ తో పోల్చుకుంటే స్ట్రయిట్ హీరోకుండేంత బిజినెస్ అక్కడ ఉందట. అందుకే బన్నీ తీసుకున్న నిర్ణయాన్ని గమనించిన కొంత మంది డైరెక్టర్లు వినియోగించుకుంటున్నారు. మోహన్ లాల్ నటించే ఓ మలయాళ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేయమని బన్నీని రిక్వెస్ట్ చేశారని టాక్ హల్ చల్ చేస్తోంది.

అయితే దీనిపై అర్జున్ ఇంత వరకు ఎస్ ఆర్ నో చెప్పలేదని కూడా వినిపిస్తోంది. సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే రానాతోనైనా చేస్తాననీ చెప్పిన అర్జున్, సరైన రోల్ లభిస్తే శిరీష్ సినిమా దేంట్లోనైనా గెస్ట్ రోల్ చేయాలనే ఆలోచనలో కూడా వున్నాడట. మొత్తానికి పెద్ద సినిమాలు, హీరో పాత్రలకే పరిమితం అయిపోకుండా, ఫలానా పాత్రే వేస్తానని గిరి గీసుకు కూర్చోకుండా పేరొచ్చే రోల్ ఎందులో వున్నా చేస్తానని బన్నీ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ఓపెన్ గా చెప్పేయడం చూస్తుంటే అతనిలో నిజమైన నటుడు కనిపిస్తున్నదని పలువురు అంటున్నారు.

English summary

Bunny want to do guest role in any movie