బస్సులో భార్య చనిపోతే.. ఆతర్వాత ఏమైందో తెలుసా(వీడియో)

Bus conductor and driver forced to exit a dead wife and passenger from bus

11:31 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Bus conductor and driver forced to exit a dead wife and passenger from bus

మానవత్వం గురించి పదే పదే చెప్పుకొచ్చే ఈ లోకంలో తీరా విషయం వచ్చేటప్పటికి ఎలా ప్రవర్తిస్తారో వేరే చెప్పక్కర్లేదు. అందుకు బోల్డన్ని తార్కాణాలు కనిపిస్తాయి. ఇలా మానవత్వం మరిచిన దారుణం ఒకటి మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇటీవల ఒడిశాలో జరిగిన రెండు ఉదంతాలను మరచిపోకముందే మధ్యప్రదేశ్‌ లో కూడా మరో దారుణం జరగడం పలువురిని కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కడి దామో జిల్లాలో రాంసింగ్ లోధీ అనే వ్యక్తి తన భార్య మల్లిబాయితోను, తల్లితోను, అయిదు రోజుల చిన్నారితోను కలిసి ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నాడు. అస్వస్థతగా ఉన్న మల్లిబాయి బస్సులోనే మరణించింది. దీంతో ఆ కుటుంబాన్ని బస్సు కండక్టర్ మధ్యలోనే బలవంతంగా దించేసాడు.

ఓ పక్క వర్షం, మరోపక్క దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో తన భార్య మృతదేహంతో, తల్లి, పసికందులతో రాంసింగ్ దిక్కుతోచక నిలబడిపోయాడు. అలా సుమారు అరగంట గడిచింది. చివరకు ఇద్దరు లాయర్లు ఆ దారంట పోతూ వీరి స్థితిని చూసి చలించిపోయి.. పోలీసులకు సమాచారం అందించారు. అయితే వాళ్ళు వచ్చి చూసి పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఆ లాయర్లే రాంసింగ్ పాలిట రక్షకులయ్యారు. ఆ కుటుంబానికి ట్యాక్సీని ఏర్పాటు చేసి వారి గ్రామానికి పంపేలా చూశారు. స్థానిక మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ బస్సు కండక్టర్, డ్రైవర్‌ లను అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇది కూడా చదవండి: కోరికలను నెరవేర్చలేదని మంత్రిని కొట్టి చంపిన కూలీలు!

ఇది కూడా చదవండి: తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

English summary

Bus conductor and driver forced to exit a dead wife and passenger from bus