లోయలో పడ్డ బస్సు.. పూరీ యాత్రలో విషాదం

Bus fell down at Puri

03:10 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Bus fell down at Puri

పూరీ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వాసుల ట్రావెల్ బస్సు కటక్ సమీపంలో లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదట దోపిడీ దొంగలు పడ్డారని, తర్వాత బస్సు బోల్తా పడిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా, నరసారావుపేట, వినుకొండ నియోజకవర్గం, రొంపిచర్ల మండలం నుంచి 40 మంది యాత్రికులు ఆదివారం అర్థరాత్రి బయలుదేరి పూరి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి ఈ బృందం పూరీ నుంచి కోణార్క్ బయలుదేరి వెళ్లింది. ఘాట్రోడ్లో దారికడ్డంగా రాళ్లు ఉన్నాయి.

ఇదేదో దోపిడీ గ్యాంగ్ పని అని డ్రైవర్ భయపడి బస్సును పక్కకి తప్పించాలని అనుకునే సమయంలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ధర్మశాల పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డీజీపీ రాముడు ఒడిసా డీజీపీ కేపీ సింగ్తో మాట్లాడారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని, సహాయకచర్యలు చేపట్టాలని రాముడు కోరారు. అలాగే కొంతమంది సరిహద్దు పోలీసులను సంఘటనా ప్రదేశానికి పంపించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంటున్నారు.

English summary

Bus fell down at Puri