పవన్ కి షాకిచ్చిన నాన్నకు ప్రేమతో ప్రొడ్యూసర్!

Bvsn Prasad gave shock to Pawan Kalyan

01:21 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Bvsn Prasad gave shock to Pawan Kalyan

ప్రతిఒక్కరికి ఓ అవకాశం వస్తుందని అంటారు కదా. ఇప్పుడు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కి టైం వచ్చినట్లుంది అందుకే పవర్ స్టార్ కి ఝలక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆమధ్య అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి ఓ వివాదం రేగింది తెలుసా. అదేనండీ తమకు రావాల్సిన రెమ్యునరేషన్ పెండింగులో ఉందంటూ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ఇద్దరూ ఆ మూవీ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మీద ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు కదా అదే. పవన్ కెరీర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లు సాధించిన అత్తారింటికి దారేది సినిమాకు ప్రొడ్యూసర్ ప్రసాద్ రెమ్యూనరేషన్లు పెండింగులో పెట్టడమేంటని అప్పట్లో సినీజనాలు ఆశ్చర్యపోయారు కూడా. అయితే ఆతర్వాత వివాదం సర్దుమణిగింది.

కట్ చేస్తే, తన బ్యానర్ లో నాన్నకు ప్రేమతో డైరెక్ట్ చేసిన సుకుమార్ కు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రీసెంట్ గా లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాన్నకు ప్రేమతో హిట్టయినా భారీ లాభాలేమీ తేలేదు. అయినా సుకుమార్ కు కార్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ప్రొడ్యూసర్ ప్రసాద్.. పవన్ కు కౌంటర్ ఇచ్చాడని గుసగుసలు మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ గా నిలిచి అత్తారింటికి దారేది సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టినా హీరో, డైరెక్టర్లకు డబ్బుల సంగతి తేల్చకుండా చేసి, విషయం ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు వరకూ వెళ్తేగాని ఆ వ్యవహారం కొలిక్కిరాలేదు. అలాంటిది అడుగకపోయినా ఈ లగ్జరీ కారు గిఫ్ట్ మతలబు ఏంటంటూ టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేసింది. మొత్తానికి ప్రొడ్యూసర్ ఇచ్చిన ఝలక్ తో అందరి బుర్రల్లో ఒక్కో రకమైన ఆలోచన రేగుతోంది.

English summary

Bvsn Prasad gave shock to Pawan Kalyan