వర్మ కాలర్ పట్టుకున్న నిర్మాత

C Kalyan Warned me says Ram Gopal varma

12:19 PM ON 24th March, 2016 By Mirchi Vilas

C Kalyan Warned me says Ram Gopal varma

నిత్యం ఏదో ఒక వివాదంతో ఏదో విధంగా ఎప్పుడు వార్తల్లో ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇటు సినిమాల పైనే కాక , అటు రాజకీయాల పైనా ఎవరు స్పందించని విధంగా స్పందిస్తాడు రామ్ గోపాల్ వర్మ. హీరోలు , హీరోయిన్ల పై సెటైర్లు వెయ్యాలన్నా , హీరో ను కామెంట్ చెయ్యాలన్న ఆయనకు అయానే సాటి . మొన్నిటికి మొన్న వంగవీటి మోహన రంగా పై సినిమా తీస్తానని అందుకోసం విజయవాడ వస్తున్నానని వార్తల్లో నిలిచిన వర్మ , తాజాగా తనను ఒక ప్రొడ్యూసర్ చొక్కా కాలర్ పట్టుకుని , స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక వివరాల్లోకి వెళ్తే... రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం హీరో గా మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ హీరో నటించిన "అటాక్" చిత్రం ఆడి వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక నిర్మాత ఇచ్చిన వార్నింగ్ వాళ్ళ తనకు జ్ఞానోదయం అయ్యిందని , అంతేకాక ఆ నిర్మాత తన చొక్కా కాలర్ పట్టుకుని , స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.

వర్మ మాట్లాడుతూ ఒక రోజు నిర్మాత కళ్యాణ్ గారు తన దగ్గరకు వచ్చి "శివ , రక్త చరిత్ర " వంటి హీరోయిజం ఉట్టిపడే సినిమాలను తీసే నువ్వు ఐస్ క్రీం , ఐస్ క్రీం 2 వంటి చిన్నా చితకా సినిమాలు ఎందుకు తీస్తున్నావ్ అని , అలాంటి సినిమాలను మానేసి ఇంతకు ముందు లాగా హీరోయిజం ఉట్టిపడే సినిమాలను తీయాలని తన కాలర్ పట్టుకుని సి.కళ్యాణ్ వెన్నక్కి లాగారని వర్మ అన్నాడు. సి.కళ్యాణ్ అల రెండు గంటల పాటు ఒక రూంలోతనకు క్లాస్ పీకారని , ఆ రూం ఇంకా చాలా జరిగింది అని ,కానీమొహమాటం వల్లచెప్పలేకపోతున్నాను అంటూ చెప్పిన వర్మ , ఆ క్లాసు కు ప్రతి రూపమే ఈ "అటాక్" సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. అటాక్ సినిమాలో మంచు మనోజ్ తో పాటు వడ్డే నవీన్ , జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి నటులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

ఇండియా టీమ్ కు పూనమ్‌ హాట్‌ గిఫ్ట్‌

అబ్బాయికి గర్భ సంచి..

English summary

Controversial Director Ram Gopal Varma Said that He was warned by the producer by Holding Varma's Shirt Collar.Ram Gopal Varma Says that he was warned by the Producer C.Kalyan for making smaall movies and he suggested him to make movies as past. Varma said this words on his latest movie "Attack" Movie Audio Function.Manchu Manoj, Prakash Raj,Jagapathi Babu,Vadde Naveen were acting in lead roles in this movie and this movie was going to be released on April 1st.