ఎయిర్‌ హోస్టెస్‌ ని వేధించిన క్యాబ్ డ్రైవర్

Cab driver teased air hostess at Shamshabad airport

11:10 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Cab driver teased air hostess at Shamshabad airport

మహిళను వేధించడం ఓ ఫ్యాషన్ గా మారింది. ఇంకా చెప్పాలంటే పైశాచికత్వం పెచ్చు మీరుతోంది. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఎయిర్ హోస్టెస్ తో క్యాబ్ డ్రైవర్ వెకిలిగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఓ ఎయిర్ హోస్టెస్ సోమవారం మిడ్ నైట్ టాక్సీ ఎక్కింది. కారు డ్రైవర్ ఆమెను హైదరాబాద్ రాజేంద్రనగర్ శివార్లలోకి తీసుకెళ్లినట్టు రకరకాల మాటలతో ఇబ్బందిపెట్టి అక్కడే వదిలి వేసినట్టు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మరో ట్యాక్సీ ఎక్కి.. డ్రైవర్ వద్ద ఫోన్ తీసుకుని బంధువులకు సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు నింధితుడి కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిని వెంట బెట్టుకుని ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మరోవైపు ఆ ప్రాంతంలో వున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. టవేరా కారులో యువతిని తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

ఇది కూడా చదవండి: పేరు పెట్టి పిలిస్తే భయపడుతున్న ఎన్టీఆర్ ...

ఇది కూడా చదవండి: పతకాల గురించి రామ్ దేవ్ షాకింగ్ కామెంట్స్

ఇది కూడా చదవండి: బాలయ్య కారుకి తప్పిన మరో ప్రమాదం..

English summary

Cab driver teased air hostess at Shamshabad airport. A cab driver teased air hostess at Shamshabad airport.