కేంద్రమంత్రికి లీకైన కట్టప్ప రహస్యం!

Cabinet minister knows that why Kattappa killed Baahubali

12:22 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Cabinet minister knows that why Kattappa killed Baahubali

ప్రపంచంలో చాలామంది బాహుబలి సినిమా చూసారు. అందులో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం కోసం యావత్తు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం బాహుబలి -2 ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్రమంత్రికి రహస్యం లీకయిందట. అందుకే ఆయన తనకు జవాబు తెలుసు అంటున్నారు. ఆయనే కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోర్. వివరాల్లోకి వెళ్తే...

గోవాలో జరిగిన 47వ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. చివరిరోజు రాజ్యవర్ధన్ ని గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోర్ మాట్లాడుతూ, కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడో తనకు రహస్యం చెప్పినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.ఎందుకంటే ప్రభుత్వానికి అన్నీ తెలియాలి కాబట్టి, ఇలాంటి విషయాలు ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచుతుందని డైరెక్టర్ కి తెలుసన్నారు. తనకు తెలిసినా ఏం ఫర్వాలేదంటూ అసలు సమాధానం ఇవ్వకుండానే మంత్రి కూడా దాటవేశారు. అంటే సినిమా విడుదల కాకుండానే విషయం లీకయిందన్నమాట. అది కూడా డైరెక్టర్ రాజమౌళి ద్వారానే కావడం విశేషం.

English summary

Cabinet minister knows that why Kattappa killed Baahubali