జూన్ 21 తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ!

Cabinet ministers expand from June 21

01:20 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Cabinet ministers expand from June 21

మొత్తానికి కేంద్ర కేబినెట్ విస్తరణకు మార్గం సుగమమైనట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న కేంద్ర కేబినెట్ లో మార్పుల పై ప్రస్తుతం స్పష్టత కనిపిస్తోంది. ఎందుకంటే, కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవల్ ఇటీవల అసోం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అలాగే మరికొన్ని శాఖల పనితీరు ఆశించిన విధంగా లేకపోవడంతో కేబినెట్ లో మార్పులు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత ప్రధాని మోడీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎంపీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, సత్యపాల్ సింగ్, సాధ్వీ సావిత్రిబాయి పూలే పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి ఒక్క ఎంపీ కూడా కేబినెట్ లో లేరు. దీంతో ఈసారి భగత్ సింగ్ కోశ్యారి, అజయ్ టంటాలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ సిద్ధు, రామేశ్వర్ తేలి పేర్లు వినిపిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలోని ఎంపీలకు కూడా కేబినెట్ లో అవకాశం కల్పిస్తారన్న మాట వినిపిస్తోంది.

English summary

Cabinet ministers expand from June 21