కేంద్ర మంత్రివర్గం..... 19 మంది ఇన్, 6 గురు అవుట్

Cabinet Ministers list

01:46 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Cabinet Ministers list

ఎట్టకేలకు కేంద్రమంత్రివర్గం విస్తరణ అయింది. గత కొంత కాలంగా ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్తగా 19 మందికి చోటు దక్కింది. ఆరుగురికి ఉద్వాసన పలికారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్ ప్రమోషన్ కొట్టారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా జవదేకర్ ప్రమాణం చేశారు. అయనతో పాటు మరో 19 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో మంగళవారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు ఆరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, అశోక్ గజపతిరాజు, మనోహర్ పారికర్, నితిన్గడ్కరీ, సదానందగౌడ, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. కాగా మోదీ సహా ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పటికే ఎనిమిది మంది కేబినెట్లో ఉన్నారు. కొత్తగా మరో ఐదుగురికి అవకాశం కల్పించారు. దాంతో, కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే కేబినెట్ మంత్రుల సంఖ్య 13కు పెరిగింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒకే రాష్ట్రం నుంచి ఇంతమందికి కేబినెట్ లో చోటు కల్పించడం కూడా ఇదే తొలిసారని అంటున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన కేంద్రమంత్రులు వీరే:

1. ఫగ్గన్ సింగ్ కులస్తే(మండ్లా, మధ్యప్రదేశ్)

2. ఎస్ఎస్ అహ్లువాలియా(డార్జిలింగ్, పశ్చిమ్ బంగా)

3. రమేష్ చందప్ప జిగజినాగి(బిజాపూర్, కర్ణాటక)

4. విజయ్ గోయాల్(రాజ్యసభ, రాజస్థాన్)

5. రామ్దాస్ అథవలే, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(మహారాష్ట్ర, రాజ్యసభ)

6. రాజెన్ గోహేన్(నాగావ్, అసోం)

7. అనిల్ మాధవ్ దవే(మధ్యప్రదేశ్, రాజ్యసభ)

8. పురుషోత్తమ్ రూపాలా(గుజరాత్, రాజ్యసభ)

9. ఎంజే అక్బర్(ఝార్ఖండ్, రాజ్యసభ)

10. అర్జున్ రామ్ మేఘ్వాల్(బకనీర్, రాజస్థాన్)

11. జశ్వంత్ సిన్హ్ భాబోర్(దాహోద్, గుజరాత్)

12. మహేంద్రనాథ్ పాండే(చండౌలి, ఉత్తర ప్రదేశ్)

13. అజయ్ టంటా(అల్మోరా, ఉత్తరాఖండ్)

14. కృష్ణారాజ్(షాజనాపూర్, ఉత్తరప్రదేశ్)

15. మన్సుఖ్ భాయ్ మందావియా(గుజరాత్, రాజ్యసభ)

16. అనుప్రియ పటేల్(అప్నాదళ్ పార్టీ)(మిర్జాపూర్, ఉత్తర్ ప్రదేశ్)

17. సీఆర్ చౌదరి(నాగౌర్-రాజస్థాన్)

18. పీపీ చౌదరి(పాలి, రాజస్థాన్)

19. శుభాష్ రామ్రావ్ భామ్రే(ధూలే, మహరాష్ట్ర) ప్రమాణం చేశారు.

English summary

Cabinet Ministers list