శ్రీసిటీ సెజ్‌లో క్యాడ్‌బరీ చాక్లెట్‌ ఫ్యాక్టరీ

Cadbury Chocolate Factory In Sri City

11:40 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Cadbury Chocolate Factory In Sri City

ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటు చేసిన మాండల్స్‌ ఇంటర్నేషనల్‌ (క్యాడ్‌బరీ) చాక్లెట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. ఈ ఫాక్టరీకి సంబంధించి తొలిదశ ఏప్రిల్‌ 25న ప్రారంభం కానుంది. కంపెనీ ప్రతినిధులు గురువారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కంపెనీ విస్తరణ, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మాండల్స్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ కంట్రీ హెడ్‌ వెంకటేశం చంద్రమౌళి, గవర్నమెంట్‌ సర్వీసెస్‌ హెడ్‌ అమిత్‌ కుమార్‌ సింగ్‌, సీఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్‌, ఆహారశుద్ధిశాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరోసారి మంచు లక్ష్మి పై మండిపడ్డ మోహన్ బాబు

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

134 ఎకరాల్లో ఏర్పాటైన ఈ కర్మాగారం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అతి పెద్దదని తెలిపారు. మేకిన్‌ ఇండియా-మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ విధానంలో భాగంగా ఈ కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చాక్లెట్లు, బిస్కెట్లు, గమ్‌ అండ్‌ క్యాండీ, శీతలపానీయాలు, డెయిరీ మిల్క్‌, క్యాడ్‌బరీ సెలబ్రేషన్స్‌, సీడీఎం సిల్క్‌, బోర్న్‌విటా, పర్క్‌, ఫైవ్‌స్టార్‌ చాక్లెట్లు, జెమ్స్‌, క్యాడ్‌బరీ బోర్నవిల్లే తదితర ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నట్లు తెలిపారు. నాలుగు దశల్లో ప్రాజెక్టు పూర్తిచేసి 2020 నాటికి 2.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనివల్ల 1,600 మందికి ప్రత్యక్ష ఉపాధి, వేలాది మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్లాంట్‌లో సౌర విద్యుత్తును ఉపయోగిస్తామని తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ‘శుభ్‌ ఆరంభ్‌’ పేరుతో ప్లాంట్‌ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి భారీస్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో క్యాడ్‌బరీ ప్లాంట్‌ ఏర్పాటుతో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

‘ఇంటర్నెట్‌ స్టార్‌’ మోడీ యే ...

ఆ డబ్బు స్వచ్చంద సంస్థలకి ఇవ్వమంటున్న

రాశీఖన్నా పెళ్లి కూతురాయేనే!

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

English summary