ఆమె నాలుక బీమా విలువ తెలిస్తే షాకవుతారు

Cadbury Worker Haley Carton Taste Buds Insurance

10:44 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Cadbury Worker Haley Carton Taste Buds Insurance

చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ చాక్లెట్ రుచి చూసిన ప్రపంచ ప్రఖ్యాత చాక్ లెట్ బ్రాండ్ క్యాడ్బరీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఒకసారి దానిని రుచి చూసినవారు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతబాగుంటుంది మరి. అయితే ఈ రుచి వెనక క్యాడ్బరీ సంస్థలోని ఓ సైంటిస్టు నాలుక ఉంది. అందుకే ఆ సైంటిస్ట్ నాలుకపై ఉన్న రుచిమొగ్గల(టేస్ట్ బడ్స్)ను క్యాడ్బరీ సంస్థ అక్షరాల ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు బీమా చేయించింది.

క్యాడ్బరీ సంస్థ తయారుచేసే చాలా ఉత్పత్తుల విజయం వెనక హేలీ కర్టిస్ దాగి ఉంది. బర్మింగ్ హామ్ లోని బోర్నవిల్లేలోని ఇన్నోవేషన్ కిచెన్ లో ఆమె 300 మందితో కలిసి పనిచేస్తుంటుంది. ఆమె నాలుక మీది రుచిమొగ్గలు అత్యత్తమమైనవని, క్యాడ్బరీ ఉత్పత్తుల అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు సాధించడం వెనక ఆమె టేస్ట్ బడ్స్ ఉన్నాయని క్యాడ్బరీ పేర్కొంది. అందుకే ఆమె టేస్ట్ బడ్స్ ను రూ.8.86 కోట్లకు బీమా చేయించినట్టు పేర్కొంది. బీమా గురించి తెలిసిన హేలీ ఇది తనకు దక్కిన గౌరవంగా పేర్కొంది. ఇక శరీర భాగాలకు బీమా చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని హేలీ టేస్ట్ బడ్స్ కు బీమా చేసిన లాయిడ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చూడండి: తలుపులున్న వైపు కాళ్ళు పెట్టి పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: కలాం హెయిర్ స్టైల్ తో పాటు మీకు తెలియని నిజాలు!

ఇది కూడా చూడండి: దెయ్యాల గురించి ఈ వివరాలు చెప్పి మరీ చచ్చిపోయాడు!

English summary

Cadbury Worker Haley Carton Taste Buds Insurance.