రూ. 500 కోట్లు భారీ దోపిడీ చేసిన కాల్ సెంటర్!

Call centre did 500 crores scam

11:32 AM ON 7th October, 2016 By Mirchi Vilas

Call centre did 500 crores scam

మోసాలు అనేక రకాలు. ఇప్పుడు వెలుగు చూసిన మోసం భయంకరమైనది. మహారాష్ట్రలోని థానెలోని మీరా రోడ్డు కాల్ సెంటర్ స్కాం వెల్లడిస్తున్న భయంకర వాస్తవంలోకి వెళ్తే, గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా మన దేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచే. ఇది అబద్ధం అనుకుంటే పొరపాటే. ఇది బయటపడడంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు బయటపడింది కూడా చాలా చిన్నదే కావచ్చని, ఇందులో మరింత పెద్ద మొత్తం కూడా ఉండి ఉండొచ్చని పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ అంటున్నారు.

కేవలం అమెరికాలోనే కాక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. అక్రమ కాల్ సెంటర్లకు చెందిన మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.

1/4 Pages

ఇంతకీ స్కాం జరిగిన తీరు చూస్తే..


కాల్ సెంటర్ ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టు చేస్తామని బెధిరించి, అలా అరెస్టు చేయకుండా ఉండాలంటే 500 నుంచి 60వేల డాలర్ల వరకు అపరాధపు సొమ్ము కింద వసూలు చేస్తున్నట్లు చెప్పి వసూలు చేసేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు తస్కరించిన సమాచారాన్ని(డేటా) భారత్ కు పంపేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి, చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో కొంతకు సెటిల్ చేసేవారు.

English summary

Call centre did 500 crores scam