'వడ్డీ రాక్షసం' - కాల్ మనీ మాటున సెక్స్ రాకెట్ 

Call Money Incidence In Vijayawada

12:44 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Call Money Incidence In Vijayawada

విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో ఎంతోమంది బాధితులు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టగా , ఇంకా క్యూ కడుతున్నారు. ఎన్నో ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు మొర పెట్టుకు నే వారి సంఖ్యా హెచ్చుతోంది. సిఎమ్ చంద్రబాబు వరకు వడ్డీ రాక్షసం గురించి పాకడం , వివిధ పార్టీలు , వ్యక్తులు ఆందోళనకు దిగడం , ఈ వ్యవహారం విశ్వవ్యాప్తమైంది.

దృఢ కాయులైన బౌన్సర్ లను మేపుతూ , తమ వడ్డీ వ్యాపారాన్ని కోట్లకు విస్తరించిన ఘనులు చేస్తున్న అరాచకాలు , లైంగిక వేధింపులు , ఆస్తుల స్వాధీనం వంటి పైశాచిక చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబులు, ప్రజాప్రతినిధులు ఈ దందా వెనుక వున్నట్లు ఆరోపణలు తీవ్రమయ్యాయి. మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్న కాల్ మనీ రాకెట్ మాటున సెక్స్ రాకెట్ కూడా దాగుందని ఇప్పటికే తెలుస్తోంది. విజయవాడ సిపి గౌతం సంవాంగ్, డిసిపి కాళిదాస్ ఈ కేసు పురోగతిపై సమీక్షిస్తున్నారు.

మోహన్ అనే వ్యాపారి తనను ఎలా బెదిరించిందీ, అసభ్యంగా మాట్లాడిందీ ఓ బాధితురాలు తెలిపి కన్నీటి పర్యంతమైంది. 'తన చెల్లెలి ఆపరేషన్ కోసం తాను రూ.50 వేలు అప్పుగా తీసుకున్నా. అయితే ఇప్పటికే రూ.2 లక్షలు కట్టా. కానీ అప్పు తీరలేదంటూ తన ఇంటి డాక్యుమెంట్లు తీసుకుపోయారు. వాటి గురించి అడిగితే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఏడాదిన్నరగా నెలకు 10 వేల చొప్పున కడుతున్నా ఇలా వేధిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆమె పేర్కొంటూ, ఈ కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వ పెద్దలవరకు వెళ్ళడంతో ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని తనకు న్యాయం చేయకపోతే మోహన్ ఇంటి ఎదుటే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆ బాధితురాలు వాపోయింది.

ఓ మధ్య తరగతి మనిషి 4 లక్షల అప్పు చేసాడు. ప్రతిరోజూ 8 వేల రూపాయల చొప్పున వడ్డీ కట్టాలి. ఈ భారం భరించలేక అతడు అసలు , వడ్డీ ఒకేసారి కట్టాలని డబ్బు పట్టుకుని వెళితే, చాలా బిజీ అని చెప్పిన కాల్ మనీ నిర్వాహకులు పది రోజులపాటు తిప్పించుకుని, అప్పడు సెటిల్ చేసారట. ఈ పది రోజులకు కూడా వడ్డీ వసూలు చేసారట.

ఇక అత్యవసరం వచ్చి ఓ వ్యక్తి 11లక్షలు అప్పు చేస్తే, రోజువారీ 25 వేల రూపాయల వడ్డీ అట. పరిస్థతి బాగోలేక ఓ నెలరోజుల పాటు వడ్డీ కట్టలేకపోతే, ఒక కోటి 50 లక్షల రూపాయల విలువైన అతని ఇల్లు బినామీ పేరిట రాయించుకున్నారు. పోనీ ఇల్లు అమ్మి అప్పు కడతానన్నా ఫలితం శూన్యం.

కాల్ మనీ వ్యవహారంపై సిఎమ్ చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సదస్సులో ప్రస్తావిస్తూ , కాల్ మనీ అరికట్టడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని , ఎవరూ అధికవడ్డీ కట్టకుండా చూడాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ వ్యాపారం పై దర్యాప్తు చేపడతామని హొమ్ మంత్రి చినరాజప్ప అంటున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించి , దోషులపి కఠిన చర్యలు చేపట్టాలని సిపిఎమ్ నేత బివి రాఘవులు డిమాండ్ చేసారు.

English summary

Vijayawada Task Force police have during their raids have reportedly came to a conclusion that the ruling party leaders and people’s representatives have been assisting and financing the Call money racke