బాబు అండతోనే బెజవాడలో కాల్ మనీ అట

Call Money Issue Investigation

02:20 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Call Money Issue Investigation

సిఎమ్ చంద్రబాబు అండతోనే బెజవాడలో కాల్ మనీ సాగిందట. ఇందులో టిడిపి ఎంఎల్ఎ లు , పోలీసు అధికారులూ ఉన్నారట. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే కాల్ మనీ కేసు నీరుగార్చాలని ప్రయత్నించిందట. అందుకే విజయవాడ ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులకు ఆపాదించి, దాడులు చేయించారట. ఇంతకీ ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు. వైసిపి అధినేత జగన్. శాసన సభలో కూడా చర్చను పక్కదారి పట్టించి , ప్రజల దృష్టి మళ్ళించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు ముందు మీడియాలో కాల్ మనీ మాటున బెజవాడలో సాగుతున్న సెక్స్ రాకెట్ బాగోతం గురించి పుంఖాను పుంకాలుగా వార్తలు వచ్చాయని, దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తే, తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కావాలనే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించారని , ఈవిధంగా బెజవాడ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని రాష్ట్రంలో వడ్డీ వ్యాపారానికి లింకు పెట్టారని ఆయన ఆరోపించారు.

మరోపక్క అసెంబ్లీలో డాక్టర్ అంబేద్కర్ పై చర్చ అని , మరొకటని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిందని జగన్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సిఎమ్ చంద్రబాబుని కామ సిఎమ్ గా ఎంఎల్ఎ లు పేర్కొంటే, కేవలం రోజానే టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం లో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కామ సిఎమ్ అనడం గురించి ఆయన వివరిస్తూ , కా అంటే కాల్ , మ అంటే మనీ అందుకే కామ అని వ్యవహరించినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

కేవలం ఇదు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరపడం శోచనీయమని జగన్ అన్నారు. కాల్ మనీ మాటున బెజవాడలో సాగుతున్న సెక్స్ రాకెట్ లో టిడిపి వాళ్ళను కాపాడడానికే సిఎమ్ ఈవిధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు

English summary

Jagan Saysa that So Many police and TDP leaders were in Call money case. He says that Chandrababu naidu hand also was there in that case