రోజంతా ఎండలో ఉంచాడని ఓనర్ తల కొరికి చంపేసిన ఒంటె

Camel Bites Owners Head For Tied It In Heat

11:52 AM ON 25th May, 2016 By Mirchi Vilas

Camel Bites Owners Head For Tied It In Heat

పగలు ప్రతీకారాలు మనుషులకే అనుకుంటాం , కానీ కేవలం మనుషులే కాదు జంతువులు కుడా పగతీర్చుకున్తాయని ఒక ఘటన రుజువు చేసింది . ఆ ఒంటె యజమాని దాన్ని ఎండలో కట్టి ఉంచాడని ఆ యజమాని తల కొరికి చంపేసింది.

వివరాల్లోకి వెళ్తే...... రాజస్తాన్ లోని బార్మర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటె ను రోజు మాదిరిగానే రాత్రి పూట కట్టేసి ఉంచాడు . అయితే మరుసటి రోజు ఉదయం ఆ ఒంటె యజమాని ఇంటికి బంధువులు రావడంతో తన ఒంటె ను చల్లటి ప్రదేశంలోకి మార్చడం మర్చిపోయాడు . దీంతో రోజంతా 43 డిగ్రీల మండే ఎండలో దాన్ని వదిలేసాడు . తన ఒంటె ను ఎండలోనే కట్టేసి ఉంచిన విషయం గుర్తు రావడంతో ఒంటె ను చల్లటి ప్రదేశంకు మార్చడానికి వెళ్ళిన ఆ యజమాని చూడగానే ఆ ఒంటె ఒక్కసారిగా కోపంతో ఊగిపొయి తన యజమాని పై దాడి చేసి అతని తల ను కొరికేసి , అతని పీకను పట్టుకుని అటు ఇటు విసిరికొట్టింది . దీంతో ఆ ఒంటె యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆఖరికి ఆ ఒంటెను 25 మంది గ్రామస్తులు 6 గంటల పాటు శ్రమించి ఒంటె ను శాంతపరిచారు. ఈ ఘటన ఆ ప్రాంతంలోని ఒంటె యజమానులను భయాందోళనలకు గురి చేసింది.

ఇవి కూడా చదవండి:భారత దేశం గురించి సౌధీ మేధావి ఏమన్నాడు?

ఇవి కూడా చదవండి:పోలీస్ స్టేషన్ లోనే బట్టలు విప్పేసింది.. ఎందుకో తెలుసా?(వీడియో)

English summary

A Weird Incident was occurred in Rajasthan that a camel killed by biting its owners neck and head for tied it in heat all the day. The owner actually forgot to take him camel to cool place but due to arrival of relatives to his home he forget to tied it in cool place. At the evening when owner came to that camel and taking it to cool place then the camel severely attacked its owner and killed him.