టర్కీలో క్యామిల్ రెజ్లింగ్

Camel Wrestling In Turkey

10:14 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Camel Wrestling In Turkey

కోళ్ల పందేలు, ఎడ్ల బండి పోటీలు, జల్లికట్టు లాంటి కార్యక్రమాలు మనకు తెలిసిందే. ఇదే కోవలో టర్కీ దేశంలో ఒంటెల కుస్తీ సూపర్ పాపులర్. టర్కీలోని బెర్గమా సిటీలో ఈ తరహా పోటీలు రెండు వేల ఏళ్ల నుంచి జరుగుతున్నాయట. ఏటా వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పోటీలు జరుగుతాయి. అయితే సెల్కుక్ లో జరిగేవే వీటిలో మేగా ఈవెంట్ అట. ఈ పోటీకి దాదాపు 150 మంది ఒంటెల యజమానులు వస్తారట. 20,000 మందికి పైగా ప్రేక్షకులుంటారు. ఈ పోటీల్లో పందేలు మాత్రమే కాకుండా ఒంటెల అందాల పోటీలు, కవాతులు ఉంటాయి. మన కోళ్లలాగే ఈ పోటీల కోసం ఒంటెలను చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణతో పెంచుతారు. ఇక ఒంటెల పోరాటం మొదలయినప్పుడు, వాటి వాటి యజయానులు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటారు. ఎదైనా ఒంటె పారిపోయినా, కిందపడిపోయినా దాని ప్రత్యర్ధి ఒంటెను విజేతగా నిర్ణయిస్తారు. గెలిచిన ఒంటెకు మంచి ధర పలుకడం మాములే. దాదాపు 20,000 వేల అమెరికన్ డాలర్ల వరకు ధర పలుకుతుంది.

English summary

Every year Camel Wrestling competition was conducted in Turkish city of Bergama.This competitions was celebrated from 2400 years.In this competition more than 150 camel owners and more than 20,000 spectators were participated