మాల్యాను వెనక్కి రప్పించడం కష్టమా ?

Can Vijay Mallya Bring Back To India

10:37 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Can Vijay Mallya Bring Back To India

యూబీ గ్రూప్ మాజీ ఛైర్మన్, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశ ప్రజలను మోసగించినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఆయన భారత పౌరుడిగానే ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, తాజాగా వెలువడున్న కథనాల మేరకు.. విజయ్ మాల్యాకు బ్రిటన్ పౌరసత్వంతో పాటు.. ఓటు హక్కును కూడా కలిగివున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఇక భారత్‌కు రప్పించడం అంత సులభం కాదని పలువురు న్యాయ నిపుణులు కూడా అంటున్నారట. భారత పారిశ్రామిక దిగ్గజంగా, భారత రాజ్యసభ సభ్యుడిగా, ప్రజా జీవితంలో ఉన్నమాల్యా ఇన్నాళ్ళూ తాను పారిపోలేదని, తాను కూడా ఓ ఎంపినని నమ్మబలికి తీరా ఇప్పుడు ఇలా చేయడం చూస్తుంటే, ఎన్నో నిజాలను దేశ ప్రజల ముందు దాచి వుంచినట్టు తెలుస్తోంది. ఈ కథనాలు నిజమైన పక్షంలో భారత విదేశాంగ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినా ఆయనకు కలిగే నష్టం ఇసుమంతైనా ఉండదు సరికదా, తమ పౌరుడిని అప్పగించేందుకు బ్రిటన్ ససేమిరా అంటుంది. దీంతో మాల్యాను ఇండియాకు తెచ్చి చట్టం ముందు దోషిగా నిలిపే అవకాశం సన్నగిల్లుతాయని విశ్లేషకుల అంచనా.

ఇవి కూడా చదవండి: సర్దార్ సెట్లో ఫైర్

లండన్‌కు కూతవేటు దూరంలో ఉన్న 'లేడీ వాక్' అనే మూడంతస్తుల నివాసభవనం తన అధికారిక చిరునామా అంటూ, 'ది సండే టైమ్స్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాల్యా వ్యాఖ్యానించారు. దీని యాజమాన్య హక్కులు పూర్తి చట్టబద్ధమేనని ఆయన తెలిపారు. అసలు విషయమేమంటే, 1992 నుంచే ఆయన బ్రిటన్ పౌరుడిగా ఉన్నాడట. అయితే, ఈ విషయాన్ని రాజ్యసభకు నామినేట్ అవుతున్న వేళ, సమర్పించే అఫిడవిట్‌లో ఆయన ఎక్కడా పేర్కొనక పోవడం రుణాలు ఎగ్గొట్టడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అనుమానం అందరిలో కలుగుతోంది. ఏది ఏమైనా ఇది జాతి ద్రోహం కిందకే వస్తుందని అంటున్నారు. మాల్యా విషయంలో వస్తున్న తాజా కధనాలు నిజమైన పక్షంలో మరి దీని పై కేంద్రం ఎలా స్పందిస్తుందో, భవిష్యత్తులో ఇలాంటి లూప్ హొల్స్ కి ఆస్కారం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

English summary

Can Vijay Mallya to Bring Back to India. Some of the Experts and Lawyers were saying that it was difficult to bring back Mallya to India because He was the Citizen of Britain from 1992.